Begin typing your search above and press return to search.
అంత దాపరికం ఎందుకో!!
By: Tupaki Desk | 27 Jan 2018 5:08 AM GMTతాము ఇప్టపడే హీరోలకు సంబంధించి ప్రతి విషయం తెలుసుకోవడానికి అభిమానులు తెగ ఆరాటపడిపోతారు. వాళ్లకు సంబంధించి చిన్న విషయాలను కూడా పెద్దదిగానే పరిగణిస్తారు. అదే తమ ఫేవరెట్ నటుడు ప్రమాదం బారిన పడితే అతడి క్షేమం గురించి ఆరాటపడిపోతారు. కానీ చాలాసేపు అదో సస్పెన్స్ స్టోరీలాగా చాాలాసేపు క్లారిటీ రాకపోతే అభిమానుల్లో రకరకాల భయాలు వచ్చేస్తాయి.
తాజాగా ఓ యంగ్ హీరో షూటింగు నుంచి ఇంటికి వస్తూ కారు యాక్సిడెంట్ కు గురయ్యాడు. వెంటనే మరో కారులో ఆ స్పాట్ నుంచి వెళ్లిపోయాడు. కానీ ఈ విషయం దాచి ఉంచేశారు. తరవాత ఓ టీవీ ఛానల్ లో దీనిపై న్యూస్ రావడంతో అభిమానులంతా తెగ ఆరాలు తీయడం మొదలెట్టారు. అసలు ఆ యాక్సిడెంట్ కు సంబంధించి ఎవరి దగ్గరా ఎలాంటి స్పష్టమైన సమాచారం లేకపోవడం.. ఒకవేళ అడిగినా క్లారిటీ ఇచ్చేవాళ్లు లేకపోవడంతో ఫోన్లు తెగ మోగాయి. జరిగింది పెద్ద ప్రమాదం కానప్పుడు.. ప్రత్యేకించి ఎవరి తప్పు లేనప్పుడు ప్రమాద సమాచారం ఎందుకు దాచి ఉంచారనేది ఫిలిం నగర్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది.
టీవీ ఛానల్ లో ఇదే ఇన్సిడెంట్ పై న్యూస్ హోరెత్తి పోయాక ఆ హీరో తాను క్షేమమేనంటూ క్లారిటీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. అసలంత వరకు ఆవిషయం బయటపెట్టకుండా ఎందుకు దాచి ఉంచాల్సి వచ్చిందని టాలీవుడ్ జనాలు సందేహపడుతున్నారు. ఆ పనేదో కాస్త ముందు చేస్తే అసలు ఏ ప్రాబ్లెమూ ఉండేది కాదు కదా అనే మాటా వినిపిస్తోంది.