Begin typing your search above and press return to search.

త్రిష హ్యాండిచ్చింది అందుకా..

By:  Tupaki Desk   |   16 July 2016 11:00 PM IST
త్రిష హ్యాండిచ్చింది అందుకా..
X
సినిమా మొదలైనపుడు అంతా బాగానే ఉంది. షూటింగ్ కూడా సజావుగా సాగిపోయింది. ఆడియో వేడుక కూడా ఘనంగా చేశారు. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ‘నాయకి’ నిర్మాతలకు.. త్రిషకు మధ్య తేడా కొట్టేసింది. అసలే సినిమా రెండు నెలలు వార్తల్లో లేకుండా పోగా.. అది చాలదన్నట్లు త్రిష విడుదలకు ముందు అసలు ప్రమోషన్లకే రాలేదు. దీంతో సినిమాకు మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఇంతకీ త్రిష ప్రమోషన్లకు ఎందుకు రాలేదన్న సంగతి ఎవరికీ అర్థం కాలేదు. సినిమా చూసిన వాళ్లంతా.. రిజల్ట్ ముందే అర్థమైపోయింది కాబట్టే ఆమె ప్రమోట్ చేయలేదని కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.

ఐతే వాస్తవం వేరే ఉందని సమాచారం. ఈ సినిమాకు రెమ్యూనరేషన్‌ గా అనుకున్న మొత్తంలో రూ.50 లక్షల దాకా పెండింగ్ పెట్టేశారట. ఆ మొత్తం క్లియర్ చేయకపోవడం వల్లే త్రిష ప్రమోషన్లకు రాలేదని సమాచారం. బ్యాలెన్స్ పేమెంట్ సినిమా పూర్తయ్యాక ఇచ్చేట్లు చెప్పిన నిర్మాత.. చివరికి బిజినెస్ సరిగా జరగలేదని.. నష్టాల పాలయ్యానని చెప్పి త్రిషకు హ్యాండిచ్చేశాడట. ఇప్పటికి జరిగిన నష్టం చాలని త్రిష.. ఈ సినిమాకు దూరంగా ఉండిపోయిందట. ఐతే తక్కువ బడ్జెట్లో తెరకెక్కడమే కాక.. రెండు భాషల్లో రిలీజైన సినిమా విషయంలో నిర్మాతకు నష్టం వాటిల్లిందన్న మాట అబద్ధమని అంటున్నారు. మరి వాస్తవమేంటన్నది ఆ చిత్ర యూనిట్ వర్గాలకే తెలియాలి.