Begin typing your search above and press return to search.
త్రిష ఎందుకు తప్పుకుంది సామి?
By: Tupaki Desk | 24 Oct 2017 4:46 AM GMTవైవిధ్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ కు తమిళంలో మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన చిత్రం సామి. దాదాపు పదిహేనేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇందులో విక్రమ్ పోలీస్ ఆఫీసర్ గా నటించగా అతడి జంటగా త్రిష కనిపించింది. ఈ సినిమాను తెలుగులో బాలకృష్ణ హీరోగా లక్ష్మీనరసింహ పేరిట రీమేక్ చేశారు.
తాజాగా సామి సినిమాకు సీక్వెల్ తీయడానికి దర్శకుడు హరి రెడీ అయ్యాడు. సామి-2 పేరిట తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్ గా కీర్తి సురేష్ తో పాటు మొదటి పార్ట్ లో నటించిన త్రిషను కూడా తీసుకున్నారు. ఉన్నట్టుండి తాను ఈ సినిమా నటించడం లేదంటూ త్రిష ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఈ విషయం ట్డిట్టర్ లో తనే స్వయంగా ప్రకటించింది. ‘సామి-2 చిత్రం నుంచి నేను తప్పుకొంటున్నాను. కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా చేయలేకపోతున్నా. చిత్ర యూనిట్ కు గుడ్ లక్’ అంటూ ట్వీట్ చేసింది. అయితే ఈ క్రియేటివ్ డిఫరెన్సులు కాకరకాయలూ ఏమీ లేవు కాని.. తనకంటే చిన్నదైన మరో హీరోయిన్ కీర్తి సురేష్ కు ఈ సినిమాలో ఎక్కువ నిడివి ఉన్న పాత్రను ఇవ్వడం.. అలాగే షూటింగ్ స్పాటులో కూడా ఆమెకు ప్రాధాన్యం ఇవ్వడంతో.. త్రిషకు కోపమొచ్చి బాయ్ బాయ్ అనేసిందని సాంబార్ ల్యాండులో టాక్ వినిపిస్తోంది.
సామి-2 తీస్తున్న దర్శకుడు హరి సింగం సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకుల్లోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. సింగం మొదటి రెండు పార్టులకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తే మూడో పార్టులో హారిస్ జైరాజ్ ను తీసుకున్నాడు. ఇందులో సింగం మార్కు మ్యాజిక్ లేకపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం సామి-2 కు దేవిశ్రీని ఏరికోరి తీసుకున్నాడు డైరెక్టర్ హరి.