Begin typing your search above and press return to search.
తప్పుకున్న విషయాన్ని వదలని త్రిష
By: Tupaki Desk | 3 Aug 2018 9:51 AM GMTత్రిష.. దాదాపు 10 ఏళ్లకు పైగా హీరోయిన్ గా దక్షిణాదిన చెలామణి అవుతోంది. ప్రస్తుతం ఈమెకు అవకాశాలు తగ్గిపోవడంతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది. లేక లేక వచ్చిన గొప్ప అవకాశాన్ని కూడా ఇటీవల చేజార్చుకొని వార్తల్లో నిలిచింది.
త్రిష-విక్రమ్ జంటగా దాదాపు 10 ఏళ్ల కిందట వచ్చిన ‘సామి’ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే.. ఈ సినిమా త్రిష కెరీర్ ను మలుపు తిప్పింది. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ ‘సామీ స్క్వేర్’ తీస్తున్నాడు దర్శకుడు హరి . హీరోయిన్ గా మళ్లీ త్రిషనే తీసుకున్నాడు. కానీ ఈ అమ్మడు షూటింగ్ మొదలయ్యేటప్పటికి తప్పుకొని షాకిచ్చింది. త్రిష స్థానంలోకి ఐశ్వర్య రాజేశ్ వచ్చి సినిమా షూటింగ్ కొనసాగుతోంది.
అయితే ఎప్పుడో ముగిసిపోయిన ఈ వ్యవహారాలను త్రిష ఇప్పటికీ వదలలేదు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విక్రమ్ సినిమా నుంచి తప్పుకోవడం గురించి ప్రశ్నిస్తే మళ్లీ అదే మాట చెప్పింది. ‘సామీ స్క్వేర్’ సినిమాలో తన పాత్రకు అంత ప్రాధాన్యం లేదని.. అందుకే సినిమా నుంచి తప్పుకున్నానని చెప్పింది. కీర్తి సురేష్ కు ఎక్కువ నిడివి ఇచ్చి తనకు తక్కువ నిడివి ఉన్న పాత్ర ఇచ్చారని ఆరోపించింది. సంవత్సరం కింద వైదొలిగిన సినిమా గురించి ఇప్పటికీ త్రిష మళ్లీ కెలుకుతూ అభాసుపాలు చేస్తోంది. చిత్రం యూనిట్ త్రిష వైఖరిపై గుర్రుగా ఉంది. ఇప్పటికైనా త్రిష పాత విషయాలు చెప్పకపోతే అంతే చాలు అంటూ యూనిట్ సభ్యులు మండిపడుతున్నారు.