Begin typing your search above and press return to search.
జగదీష్ నెగటివిటీకి కారణం ఇదేనా?
By: Tupaki Desk | 3 Sep 2021 5:38 AM GMTనాని హీరోగా శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందిన టక్ జగదీష్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. కరోనా కారణంగా ఈ సినిమాను డైరెక్టర్ ఓటీటీ రిలీజ్ కు సిద్దం చేశారు. శివ నిర్వాన దర్శకత్వంలో వచ్చిన నిన్ను కోరి.. మజిలీ ఫీల్ గుడ్ మూవీస్ గా పేరు దక్కించుకున్నాయి. ఆయన సినిమాలు వరుసగా సక్సెస్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో అంతా ఉన్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ఫస్ట్ లుక్ సమయంలో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా ఉంటుందనే నమ్మకం కలిగింది. కాని ట్రైలర్ విడుదల తర్వాత సినిమా పై కాస్త నెగిటివిటీ కనిపిస్తుంది.
శివ నిర్వాన ఇంతకు ముందు తరహాలో కాకుండా ఫ్యామిలీ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేశాడు. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో చూపించిన కథను ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది. తండ్రి మాటలను నిలబెట్టేందుకు... కుటుంబం పట్ల బాధ్యత కలిగిన హీరో పాత్రలతో 1990 ల్లో చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఆ తరహా కాన్సెప్ట్ లను తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు ఆధరిస్తారు అనేది అనుమానం. కాన్సెప్ట్ అర్థం అయినప్పటి నుండి సినిమాపై నెగటివిటీ మొదలు అయ్యింది.
ఇప్పటికే సినిమాను థియేటర్లలో విడుదల చేయకుండా డైరెక్ట్ ఓటీటీ లో విడుదల చేస్తున్నారనే కోపం ఉంది. దానికి తోడు ట్రైలర్ కాస్త మూస దోరణిలో ఉండటంతో టక్ జగదీష్ పై నెగటివిటీ అలుముకుంది. సినిమా ను దర్శకుడు శివ నిర్వాన స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటాడేమో చూడాలి.
ట్రైలర్ ను చూసి సినిమా ను నిర్ణయించడం సరైన నిర్ణయం కాదు. కనుక సినిమా విడుదల అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. ఈనెల 10వ తారీకున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. నానికి జోడీగా ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ మరియు రీతూ వర్మ నటిస్తున్నారు. జగపతిబాబు ఈ సినిమాలో నానికి అన్న పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమాలో పలువురు ముఖ్య నటీనటులు కనిపించబోతున్నారు.