Begin typing your search above and press return to search.
వంశీ పైడిపల్లి ఎందుకు సైలెంటయ్యాడంటే..
By: Tupaki Desk | 3 Jan 2017 10:04 AM GMTమహేష్ బాబు సినిమాను తన కాంపౌండ్ లో చేయకుండా దిల్ రాజు దగ్గరకు తీసుకెళ్ళిపోయాడు అనేది దర్శకుడు వంశీ పైడిపల్లి మీద నిర్మాత పివిపి చేస్తున్న మెయిన్ ఎలిగేషన్ అయితే.. ఇక ''ఊపిరి'' సినిమాను ఓవర్ బడ్జెట్ తో తీసి ఏకంగా 20 కోట్ల నష్టం చవిచూపించాడు అనేది మరో కంప్లయింట్. పివిపి ఇప్పటికే చెన్నయ్ కోర్టును.. ఫిలిం ఛాంబర్ ను ఆశ్రయించినా కూడా.. ఇంతవరకు వంశీ మాత్రం ఈ యవ్వారంపై పెదవి విప్పలేదు.
అయితే వంశీకి చెందిన కొందరు సన్నిహితులను ఇదే విషయంపై కదిలిస్తే.. ''అసలు ఊపిరి సినిమా అనేది వంశీ కెరియర్లో చాలా స్పెషల్ ఫిలిం. అలాంటప్పుడు ఆ సినిమా తాలూకు సక్సెస్ ను ఇలాంటి కామెంట్లతో నాశనం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది. 70 కోట్లు బడ్జెట్ అయ్యింది.. 20 కోట్లు లాస్ వచ్చింది.. అనే కామెంట్ వంశీ కూడా విన్నాడు. కాని నిజం కాదు కాబట్టే దానిపై స్పందించట్లేదు. అందుకే సైలెంటుగా ఉన్నాడు'' అంటూ సెలవిచ్చారు.
సరే ఈ ఊపిరి బడ్జెట్ గోల పక్కనెట్టేస్తే మరి మహేష్ సినిమా మ్యాటర్ ఏంటి? దానిపై మాత్రం ఎవ్వరూ నోరు విప్పట్లేదు. వంశీ సన్నిహితులు ఏమంటున్నారంటే.. త్వరలోనే ఈ సినిమా లాంచింగ్ డేట్ ప్రకటిస్తారని సెలవిస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/