Begin typing your search above and press return to search.
దేవరకొండ అందుకే ప్రమోట్ చేయలేదట
By: Tupaki Desk | 9 March 2018 6:41 AM GMTమొన్నటి వరకు సైడ్ క్యారెక్టర్లు వేసే విజయ్ దేవరకొండ...పెళ్లి చూపులుతో సోలో హీరో అయిపోయాడు. ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి సూపర్ హిట్ కొట్టడంతో వెనక్కి తిరిగిచూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. తనకంటూ ఒక మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో మనముందుకు వస్తున్నాడు. అదే ఏ మంత్రం వేశావే... కానీ ఆ సినిమాను పెద్ద సీరియస్‌గా తీసుకోవడం లేదు విజయ్. ప్రమోషన్స్ కు కూడా దూరంగా ఉంటున్నాడు ఎందుకు?
పెళ్లి చూపులకు ముందు విజయ్ దేవరకొండను పట్టించుకునే వారు తక్కువే. అర్జున్ రెడ్డి భారీ హిట్ కొట్టడంతో... రెండు వరుస హిట్లు అతని ఖాతాలో పడ్డాయి. ఆ తరువాత వచ్చే సినిమాపై అంచనాలు భారీగా పెరగడం సాధారణమే. ఏం సినిమా వస్తుందా అని ఎదురుచూసిన వాళ్లకి... ఏ మంత్రం వేశావే సినిమా వచ్చింది కళ్ల ముందుకి. కానీ ఆ సినిమాకి కనీసం ప్రచారం కూడా చేయకూడదని విజయ్ నిర్ణయించుకున్నాడు. పాత సినిమా అన్నట్టు కాస్త హింట్ లు కూడా ఇచ్చాడు. విజయ్ చెప్పింది నిజమే. ఆ సినిమా ఇప్పటిది కాదు... 2013లో తీసిన సినిమా. అప్పట్లో విజయ్ ఎవరో ప్రేక్షకులకు కూడా తెలియదు. దీంతో సగం తీసి ఆపేశారు. ఇప్పుడు విజయ్ కు వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని భావించి... ఆ సినిమాను కంప్లీట్ చేస్తున్నారు.
షూటింగ్ లో ఉన్నప్పుడే విజయ్ కు మరో విషయం కూడా తెలిసింది. ఆ సినిమా ఓ హాలీవుడ్ మూవీ కాపీ అని. 1997లో విడుదలైన ది గేమ్ మూవీకి ఇది కాపీ అట. దీంతో ఆ సినిమాకు ఎలాంటి ప్రచారం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాడు అర్జున్ రెడ్డి. ప్రేక్షకులను మోసం చేయడం ఇష్టం లేని విజయ్... ఆ సినిమాను చూడమని ఎవరికీ చెప్పకూడదని స్వతంత్ర నిర్ణయం తీసుకున్నాడట.