Begin typing your search above and press return to search.

ఎక్స్ క్లూసివ్ : దేవరకొండ న్యూమరాలజీ నిజమెంత?

By:  Tupaki Desk   |   4 Jan 2020 11:30 AM GMT
ఎక్స్ క్లూసివ్ : దేవరకొండ న్యూమరాలజీ నిజమెంత?
X
యువహీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్' టీజర్ నిన్న విడుదల చేసిన సంగతి తెలిసిందే. నాలుగు విభిన్న గెటప్పులు.. నలుగురు హీరోయిన్లు.. ఇంటెన్స్ గా ఉండడంతో టీజర్ యూత్ ను ఆకర్షిస్తోంది. ఆ నాలుగు గెటప్స్ ఏంటి.. ఒక వ్యక్తి జీవితంలో నాలుగు దశలలో జరిగిన కథా.. లేక మరేదైనా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంటుందా అనిసోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. కొందరేమో టీజర్ 'అర్జున్ రెడ్డి' ని గుర్తుకు తెస్తోందని కూడా అంటున్నారు.

టీజర్ లోని కంటెంట్ పై ఇలా చర్చలు సాగుతుంటే మరో విషయం హాట్ టాపిక్ గా మారింది. టీజర్ లో రౌడీగారి పేరును 'దేవరకొండ విజయ్ సాయి' అంటూ టైటిల్ క్రెడిట్ ఇవ్వడంతో విజయ్ న్యూమరాలజీ ప్రకారం ఇలా మొత్తం పేరును వేసుకున్నాడని టాక్ వినిపించింది. ఈమధ్య విజయ్ నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరచడంతో ఇలా న్యూమరాలజీని ఆశ్రయించాడని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. అయితే అవేమీ నిజం కాదు.

'అర్జున్ రెడ్డి' సినిమాలో కూడా విజయ్ పేరును 'దేవరకొండ విజయ్ సాయి' అనే టైటిల్ క్రెడిట్ ఇచ్చారు. అది దర్శకుడు సందీప్ వంగా తీసుకున్న నిర్ణయమట. ఇక 'వరల్డ్ ఫేమస్ లవర్' విషయానికి వస్తే దర్శకుడు క్రాంతి మాధవ్ కు సాయిబాబా అంటే చాలా నమ్మకమట. అందుకే సాయి పేరును అలానే ఉంచుతూ 'దేవరకొండ విజయ్ సాయి' అనే టైటిల్ క్రెడిట్ ఇచ్చారట. ఇందులో రౌడీగారి ప్రమేయం ఏమీ లేదట. న్యూమరాలజీ లాంటి వాటిపై విజయ్ కి పెద్దగా నమ్మకం లేదని.. ఈ విషయం అసలు విజయ్ పట్టించుకోలేదని తన సన్నిహితులు అంటున్నారు. రెండు సందర్భాలలో దర్శకులే రౌడీగారి ఎకడమిక్ సర్టిఫికెట్స్ లో ఉన్న పేరునే ఉపయోగించారు. అది సంగతి.. సో న్యూమరాలజీ.. జఫ్ఫాలజీ లాంటివి ఏమీ లేవు!