Begin typing your search above and press return to search.
కామ్రేడ్ మాట ఎందుకు తప్పాడు?
By: Tupaki Desk | 23 April 2019 8:55 AM GMTటాలీవుడ్ లో ఉన్న క్రేజీ యూత్ హీరోలలో టాప్ చైర్ కోసం పోటీ పడుతున్న వాళ్ళలో ముందు వరసలో ఉన్న విజయ్ దేవరకొండ కొత్త సినిమా డియర్ కామ్రేడ్ విడుదల విషయంలో నెలకొన్న సందిగ్దత ఇంకొంత కాలం కొనసాగేలా ఉంది. గతంలో టీజర్ రిలీజ్ చేసినప్పుడు మే 31 అంటూ పక్కాగా డేట్ ఇచ్చారు. మల్టీ లాంగ్వేజ్ మూవీ కాబట్టి ఇంకే మార్పు ఉండదనే అనుకున్నారందరూ. అయితే అనూహ్యంగా ఇప్పుడా తేదిలో మార్పు వచ్చినట్టు సమాచారం.
ఏకంగా జూలైకు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని ఇన్ సైడ్ టాక్. నిజానికి మే 31 అనుకున్నా ఇంకా చాలా టైం చేతిలో ఉంది. షూటింగ్ దాదాపుగా పూర్తయ్యిందని ఇంతకు ముందే న్యూస్ వచ్చింది. ఏవో రీషూట్స్ అన్నారు కాని అబ్బే అదేమీ లేదని విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో కొట్టి పారేశాడు
మరి ఇప్పుడు అంత ఆలస్యం ఎందుకో అని ఫ్యాన్స్ పజిల్ లో పడిపోయారు. దానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. అదే తేదికి సూర్య ఎన్జికే(నంద గోపాల కుమార)వస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఆ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. తమిళనాడు కర్ణాటకలో భారీ విడుదల ప్లాన్ చేశారు.
తెలుగులో సైతం మంచి రిలీజ్ దక్కుతుంది. ఆ రెండు రాష్ట్రాల్లో దీని వల్ల డియర్ కామ్రేడ్ కు కొంత చిక్కు తప్పదు. ఒకవేళ జూన్ లో అనుకున్నా అప్పటికే వరల్డ్ కప్ ఫీవర్ స్టార్ట్ అయిపోతుంది. సినిమాలు చూసే మూడ్ లో క్రికెట్ లవర్స్ ఉండరు. ఐపిఎల్ కే ఈ రేంజ్ లో ఊగిపోతుంటే ఇక ప్రపంచ కప్ అంటే వేరే చెప్పాలా. అందుకే సేఫ్ రిలీజ్ కోసం డియర్ కామ్రేడ్ జూలైకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి