Begin typing your search above and press return to search.
కొంపదీసి 'లేడీ అవెంజర్స్' భారతీయ వెర్షన్ తీస్తుందా?
By: Tupaki Desk | 5 Nov 2022 5:33 AM GMTదేశీ గాళ్ ప్రియాంక చోప్రా భారతదేశం వదిలి వెళ్లి మూడేళ్లవుతోంది. అమెరికన్ సింగర్ కం నటుడు నిక్ జోనాస్ తో ప్రేమాయణం వివాహం అనంతరం తన పుట్టినిల్లు అయిన ముంబైని పూర్తి గా మర్చిపోయిందని విమర్శలొచ్చాయి. అయితే అన్ని విమర్శలకు చెక్ పెట్టేందుకు ఇప్పుడు ఇండియాలో దిగింది ఈ బ్యూటీ. ముఖ్యంగా స్వదేశానికి అందునా తన సొంత నగరం అయిన ముంబైలో అడుగు పెట్టగానే ఇక్కడ తనకు ఇష్టమైన అన్ని రుచుల్ని ఆస్వాధిస్తోంది. ముంబై స్ట్రీట్ ఫుడ్ ని కూడా అమితంగా ఇష్టపడే పీసీ ముంబై వీధుల్లో షికార్లు చేస్తూ తనదైన స్టైల్ ఫ్యాషన్ కంటెంట్ తో మెరుపులు మెరిపిస్తోంది.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా లోనెక్ నారింజ రంగు గౌన్ ని ధరించి ఆరెంజ్ స్టిలెట్టోస్ లో కొత్త రూపంతో అబ్బురపరిచింది. ఆరెంజ్ ఔట్ ఫిట్ లో పీసీ అందాలు యువతరం మతులు చెడగొడుతున్నాయి. ఇక మునుపటితో పోలిస్తే ప్రియాంక కాస్త బొద్దుగా కూడా కనిపిస్తోంది. కొందరు ఈ రూపాన్ని షేపవుట్ అయ్యిందని విమర్శిస్తే..చాలా మంది పీసీ కొత్త లుక్ లో హాట్ గా ఉందని కూడా పొగిడేస్తున్నారు. పనిలో పనిగా ముంబైలో దేశీ గాళ్ తన హెయిర్ కేర్ బ్రాండ్ ను వీలైనంత ఎక్కువగా ప్రచారం చేయడంలోను బిజీగా ఉంది.
అలాగే తన తదుపరి చిత్రం 'జీ లే జరా' కోస్టార్లు అయిన అలియా భట్ - కత్రినా కైఫ్ లను కూడా పీసీ ముంబైకి రాగానే కలుసుకుంది. ఇక తాజా ప్రచార వేదికపై పీసీ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తాను హిందీ చిత్ర పరిశ్రమలో సెకండ్ ఫిడిల్ వాయిస్తూ సంవత్సరాల పాటు ఎలా గడిపిందో జర్నీని గుర్తు చేసుకుంటూ పంచ్ లు విసిరింది.
ప్రియాంక మాట్లాడుతూ-''నేను నా కెరీర్ కోసం చాలా కాలం ఇక్కడే గడిపాను. ముంబైలో మేము (స్త్రీలు) ఎల్లప్పుడూ మేల్ తర్వాతే ద్వితీయ స్థానంలో ఉంటాము. సినిమా ఎక్కడ షూట్ చేయాలి? ఎవరిని నటీనటులుగా ఎంపిక చేయాలి? ఏం జరుగుతుందనేది హీరోలు నిర్ణయిస్తారు. అది విసుగ్గా ఉంటుంది. మహిళలు తమ జీవితంలో ఏజెన్సీని కలిగి ఉండాల్సిన కాలంలో మనం జీవిస్తున్నాం'' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తున్న 'జీ లే జరా'లో పీసీ రోల్ ఆసక్తికరంగా ఉండనుంది. ఈ చిత్రం దిల్ చాహ్తా హై - జిందగీ నా మిలేగీ దొబారా తరహాలో స్త్రీ స్నేహం గురించి ఆద్యంతం రక్తి కట్టించనుంది. ఈ చిత్రం ఆలోచన తన మనసులో ఎలా పాతుకుపోయిందో కూడా ప్రియాంక చోప్రా వెల్లడించింది. ఆ తర్వాత తన స్నేహితులు కత్రినా - అలియా భట్ లతో సుదీర్ఘ టెలిఫోనిక్ చాట్ చేసిందిట. నేను అలియా -కత్రినాకు కాల్ చేసాను. ఇది ఫర్హాన్ లేదా ఎవరైనా (బోర్డులో) రాకముందే జరిగిన సంభాషణ. నేను మొదట అమ్మాయిలను పిలిచాను. మా ఇంట్లో మేమంతా కూర్చొని ఉన్నపుడు చెప్పాను. హిందీ సినిమా చేయాలనుకున్నాను. కానీ అది నిబంధనల ప్రకారం ఉండాలని నేను కోరుకున్నాను. మహిళా ప్రధాన కథలో నటించాలనుకుంటున్నాను అని వారికి చెప్పాను! అని తెలిపింది.
మహిళా తారలు ఇప్పుడు తదుపరి మహిళా కళాకారులకు నాయికా ప్రాధాన్యత ఉన్న శక్తివంతమైన కథనాలను సిరీస్ లుగా మలచడానికి ఎలా మార్గం సుగమం చేయాలి? అనే దాని గురించి మాట్లాడుకున్నామని వెల్లడించింది. ''నా తరం నటీమణులు నిజంగా తరువాతి తరం నటీమణులు చేసే సినిమాల పోస్టర్ లపై ముఖచిత్రాలుగా మారి.. సినిమాలను అమ్మగలిగేలా నిజంగా కొత్త దారులు తలుపులు తెరిచారు. కాబట్టి నేను నిజంగా నా స్నేహితులను ఒకచోట చేర్చి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించే చిత్రాన్ని రూపొందిస్తాను. అది మనదే అవుతుంది... కాబట్టి స్టార్స్ ఏకమయ్యాము. మేము ఇలాంటి ప్రయోగం చేయాలని నిర్ణయించుకున్నాం. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభిస్తాం అని ఆశిస్తున్నాం'' అని పీసీ తెలిపారు. ప్రియాంక ప్రస్తుతం తన హెయిర్ కేర్ బ్రాండ్ లాంచ్ కోసం ఇండియాలో ఉంది. 'సిటాడెల్' -లవ్ ఎగైన్ సహా హాలీవుడ్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉంది.
ప్రియాంక చోప్రా ప్రయత్నాలు చూస్తుంటే మునుముందు భారతదేశంలో అతి పెద్ద లేడీ ఓరియెంటెడ్ ఫ్రాంఛైజీలకు శ్రీకారం చుట్టబోతోందని అర్థమవుతోంది. భారీ ప్రణాళికలతోనే ఇక్కడ అడుగుపెటటింది. స్నేహితురాళ్లను కలుపుకుని భారీ ప్రయోగాలు చేసేందుకు సిద్ధంగా ఉంది. దేశీ గాళ్ కొత్త లుక్ దుమ్ము దులిపేసిందిగా! ఒక రకంగా 'మహిళా అవెంజర్స్' తీయడానికి బరిలో దిగిందని కూడా ఊహిస్తున్నారు. నిర్మాతగా మారిన పీసీ కొంపదీసి 'లేడీ 'అవెంజర్స్' భారతీయ వెర్షన్ తీస్తుందా అంటూ అప్పుడే సందేహాలు ఫ్యాన్స్ లో రాజుకుంటున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.