Begin typing your search above and press return to search.
ఆర్.ఆర్.ఆర్' పోస్ట్ పోన్.. కారణం ఇదే !
By: Tupaki Desk | 5 Feb 2020 2:30 PM GMTఇండస్ట్రీలో కొందరు సీనియర్లు ఏదైనా ప్రకటన చేస్తే దానికి ఎంతో వాల్యూ ఉంటుంది. ఇక ఆ ప్రకటన మీద అభిమానుల్లో ఇంకో డిస్కర్షన్ కూడా ఉండదు. అయితే మొన్నా మధ్య రాజమౌళి అలాంటి ప్రకటనే చేసాడు. ఎన్టీఆర్ , చరణ్ తో ఆయన తీస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకు సంబంధించి షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే ఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ జులై 30న రిలీజ్ అంటూ అనౌన్స్ చేసాడు.
దీంతో ఫ్యాన్స్ అందరూ మురిసిపోయారు. ఇంకా సెట్స్ పై ఉండగానే జక్కన్న భలే క్లారిటీతో డేట్ చెప్పేసాడే అంటూ ఇండస్ట్రీ వర్గాలు కూడా మాట్లాడుకున్నారు. అయితే సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ ఉండవు కనుక ఇది పాసిబుల్ డేట్ అని అందరూ చెప్పుకున్నారు. కట్ చేస్తే అందరికీ షాక్ ఇచ్చే మరో ప్రకటన చేసి అవక్కయ్యేలా చేసాడు జక్కన్న.
'ఆర్ ఆర్ ఆర్' సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో జక్కన్న మాట తప్పాడంటూ అటు తారక్ ఫ్యాన్స్ ఇటు చరణ్ ఫ్యాన్స్ డిస్సపాయింట్ అయ్యారు. అయితే రాజమౌళి అనుకున్న ప్లానింగ్ ప్రకారం చెప్పిన డేట్ కే సినిమా వచ్చుండేది. కాకపోతే షూటింగ్ కి చాలా అడ్డు తగిలాయి. ముఖ్యంగా షూటింగ్ మొదలైన కొన్ని నెలలకే చరణ్ గాయ పడటం, ఆ తర్వాత తారక్ సరసన హీరోయిన్ గా తీసుకున్న హీరోయిన్ సినిమా నుండి తప్పుకోవడంతో అనుకున్న టైంకి అనుకున్న సన్నివేశాలు తీయలేకపోయాడు జక్కన్న. ఆల్మోస్ట్ సినిమాను ఈ ఏడాది ఎండింగ్ కల్లా థియేటర్స్ లోకి తీసుకురావాలని చూసారు. కానీ దసరా , దీపావళి కాకుండా సినిమా సీజన్ అంటే అది ఒక్క సంక్రాంతి మాత్రమే మేకర్స్ ఆప్షన్ గా మారింది. పైగా నిర్మాత కూడా సంక్రాంతికే తన ఒటేసాదని ఇక ఈ ఏడాది సంక్రాంతి సినిమాలు దండిగా రాబట్టడంతో ఇక హీరోలు కూడా ఆ డేట్ కే రిలీజ్ చేస్తే బాగుంటుందని ఓ మాట అనుకున్నారని తెలుస్తుంది. సో ఇవ్వన్నీ మైండ్ లో పెట్టుకొని కొందరు బడా నిర్మాతలతో కూడా ఫోన్ ద్వారా విషయం చెప్పి ఈ రోజు టైం చూసి కొత్త డేట్ ప్రకటించారట.