Begin typing your search above and press return to search.
పవన్ - త్రివిక్రమ్ మధ్య బాండింగ్ కి కారణమిదే..!
By: Tupaki Desk | 18 Sep 2021 12:34 PM GMTపవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఉండే సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల విషయంలోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారని ఇండస్ట్రీలో అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అయితే వీరిద్దరి మధ్య ఇంత బాండింగ్ ఏర్పడటానికి కారణం ఏంటి?, అసలు ఇద్దరు కలిసినప్పుడు ఏమి మాట్లాడుకుంటారో తెలుసుకోవాలనే ఆసక్తి సినీ అభిమానుల్లో ఉంది.
పవన్ సినిమాలతో పాటుగా రాజకీయాల్లో కూడా ఉన్నారు కాబట్టి.. త్రివిక్రమ్ కలిసినప్పుడు ఈ రెండింటి గురించే డిస్కష్ చేసుకుంటారని అందరూ అనుకుంటుంటారు. అయితే సినిమాల కంటే కూడా సాహిత్యం - పుస్తకాల గురించి తరచూ ఇరువురు చర్చించుకుంటారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వీరి ఫ్రెండ్ షిప్ సీక్రెట్ కూడా ఇదే. దీనికి ఉదాహరణగా చెప్పుకొనే సందర్భం నిన్న శుక్రవారం జరిగింది.
ప్రస్తుతం 'భీమ్లా నాయక్' షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ను.. నిన్న సాయంత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిశారు. సాహిత్య ప్రియులైన వీరిద్దరూ మహాకవి శ్రీశ్రీ రచనల గురించి.. ఆయన కలం నుంచి జాలువారిన 'మహా ప్రస్థానం' గురించి చర్చించుకున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీశ్రీ చేతిరాతతో ఉన్న 'మహా ప్రస్థానం' ప్రత్యేక స్మరణికను త్రివిక్రమ్ కు బహుమతిగా అందచేశారు పవన్.
'మహా ప్రస్థానం' పుస్తక ముద్రణ గురించి, అందులోని అరుదైన చిత్రాల గురించి ఇద్దరూ మాట్లాడుకున్నారని తెలుస్తోంది. త్రివిక్రమ్ ఈ సందర్భంగా పవన్ తో శ్రీశ్రీ గురించి చెబుతూ.. ''శ్రీశ్రీ వేసిన ఒక అడుగు.. రాసిన ఒక పుస్తకం.. కొన్ని శతాబ్దాల పాటు మాట్లాడుకుంటునే ఉంటుంది. శ్రీశ్రీ తెలుగువారు గర్వించదగ్గ కవి.. ఈ శతాబ్దం నాది అని గర్వంగా చాటిన వ్యక్తి. ఆయన తాలూకు జ్ఞాపకం మనజాతి పాడుకొనే ఒక గీతం. తెలంగాణ విమోచన దినోత్సవం రోజున ఆయన పుస్తకం చూడడం నిజంగా గొప్ప విషయం. ఆయన ఆత్మ ఎక్కుడున్నా స్వాతంత్ర్యం అనే సరికి అక్కడికి వచ్చి ఆగుతుంది'' అని అన్నారు. దీనికి పవన్ కూడా తనదైన శైలిలో స్పందన తెలియజేసారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఇప్పటి వరకు మూడు చిత్రాలు వచ్చాయి. అందులో 'జల్సా' 'అత్తారింటికి దారేది' సినిమాలు హిట్ అవ్వగా.. 'అజ్ఞాతవాసి' చిత్రం ప్లాప్ అయింది. ఇక పవన్ నటించిన 'తీన్ మార్' చిత్రానికి మాటలు రాసిన త్రివిక్రమ్.. 'భీమ్లా నాయక్' సినిమాకి స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో నిర్మించిన 'చల్ మోహన్ రంగా' చిత్రానికి కూడా త్రివిక్రమ్ కథ - మాటలు అందించారు.