Begin typing your search above and press return to search.
చిరంజీవిగారి సినిమాను ఒప్పుకోకపోవడానికి కారణమదే: సాయిపల్లవి
By: Tupaki Desk | 22 Sep 2021 9:32 AM GMTసాయిపల్లవి అందగత్తె అని చెప్పలేంగానీ .. ఆకర్షణకి కొదవ లేదు. ఆ ఆకర్షణ ఆమె ఆత్మవిశ్వాసంలో నుంచి పుట్టిందేమోననే విషయం ఆమె మాటలు వింటే అర్థమవుతుంది. ఆమె సినిమాలు చూస్తే స్పష్టమవుతుంది. సినిమా అంటే తనకి ప్రాణం అంటుంది .. అలా అని చెప్పేసి అన్ని సినిమాలు చేయదు. స్టార్ హీరోల సినిమాల్లో నటించాలని ఉందని అంటుంది. కానీ పాత్రల విషయంలో రాజీ పడదు. మనిషికి డబ్బు చాలా అవసరం అంటుంది కానీ .. పాత్ర నచ్చకపోతే ఎంత పారితోషికం ఇస్తానన్నా ఒప్పుకోదు. సాయిపల్లవి ఒక వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణాలు ఏం కావాలి?
'ఫిదా' సినిమా తరువాత తెలుగు ప్రేక్షకులకు సాయిపల్లవి మరింత చేరువైపోయింది. ఆ సినిమాలో 'భానుమతి'గా ఆమె స్పర్శించని హృదయం లేదు. ఆ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఆమె చేసిన మరో సినిమానే 'లవ్ స్టోరీ'. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ సందర్భంగా ఆమె తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించింది. "ఈ సినిమా స్క్రిప్ట్ ను శేఖర్ కమ్ములగారు నాకు పంపించి .. నా అభిప్రాయం అడిగారు. ఎంతమాత్రం ఆలోచన చేయకుండా వెంటనే ఓకే చెప్పేశాను. అంతగా ఆ కథకు .. పాత్రకు కనెక్ట్ అయ్యాను.
'లవ్ స్టోరీ' సినిమాలో కుల వివక్ష .. లింగ వివక్ష అనే రెండు అంశాలను టచ్ చేయడం జరిగింది. ఈ విషయాలను శేఖర్ కమ్ములగారు తనదైన స్టైల్లో చాలా సున్నితంగా చెప్పారు. ఆయన ఎంత నిజాయితీగా కథ చెబుతారో .. అంతే నిజాయితీగా తీస్తారు .. అదే ఆయన గొప్పతనం. సున్నితమైన సన్నివేశాలను వివరించడానికి ఇబ్బందిపడిపోయే మంచి మనిషి ఆయన. ఇక చైతూ కూడా అంతే .. చాలా కూల్ పర్సన్. కో స్టార్ గా ఆయన అందించిన సహాయ సహకారాలను నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఆయనతో కలిసి నటించడం ఒక మంచి జ్ఞాపకం.
ఇక చిరంజీవిగారి రీమేక్ సినిమాలో ఆయన చెల్లెలిగా చేసే అవకాశం వచ్చినప్పటికీ నేను చేయలేదు. ఒకరు చేసిన పాత్రను చేయడానికి నేను ఆలోచన చేస్తాను. అంతకుముందు చేసిన వారికంటే బెటర్ గా చేయాలనే ప్రయత్నం వలన ఆ పాత్ర దెబ్బతింటుంది. అంతకుముందు ఆ పాత్రను చేసిన వారి ప్రభావం ఎంతోకొంత పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ స్థాయిలో నేను చేయగలుగుతున్నానా? అనే ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అందువల్లనే నేను రీమేక్ సినిమాలు చేయనని చెబుతూ ఉంటాను .. అంతకుమించి మరేమీ లేదు" అని చెప్పుకొచ్చింది.