Begin typing your search above and press return to search.
ఆ రికార్డ్ డార్లింగ్ కి మాత్రమే సాధ్యం
By: Tupaki Desk | 25 Jun 2023 9:38 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఆదిపురుష్ మూవీ ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కలెక్షన్స్ పరంగా 400 కోట్లకి క్రాస్ చేసుకొని 500 కోట్ల మైలురాయిని అందుకునే పనిలో ఉంది. దేశవ్యాప్తంగా ఆదిపురుష్ చిత్రంపై హిందుత్వ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న సమయంలో కూడా ప్రేక్షకులు మూవీ చూడటానికి ఆసక్తి చూపించరు.
మొదటి మూడు రోజుల్లోనే మూడు వందల కోట్ల గ్రాస్ ని ఆదిపురుష్ సినిమా అందుకుంది. ఇదంతా ప్రభాస్ ఇమేజ్ కారణంగా వచ్చిన కలెక్షన్స్ అని చెప్పొచ్చు. ఈ చిత్రంతో ఏకంగా నాలుగు సినిమాలతో మొదటి రోజు వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన హీరోగా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు అరుదైన రికార్డ్ కూడా డార్లింగ్ ఖాతాలో చేరిపోయింది.
నార్త్ అమెరికాలో ఆదిపురుష్ మూవీ ఏకంగా 3 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. దీంతో ఇప్పటి వరకు అక్కడ 3 మిలియన్ క్లబ్ లో చేరిన సినిమాలు మొత్తం 8 సినిమాలు ఉంటే అందులో డార్లింగ్ ప్రభాస్ నటించినవి నాలుగు చిత్రాలు ఉండటం విశేషం. బాహుబలి 1, 2, సాహో, ఆదిపురుష్ సినిమాలు నార్త్ అమెరికాలో 3 మిలియన్ క్లబ్ అందుకున్నాయి.
నిజానికి ఆదిపురుష్ కలెక్షన్స్ ఇంకా ఎక్కువ వచ్చేది. అయితే నిర్మాత సొంతంగా రిలీజ్ చేసుకోవడం, టికెట్ ధరలు తగ్గించడం వలన ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ మీద పడింది. అయితే ప్రేక్షకాదరణ బాగుండటంతో 3 మిలియన్స్ ని ఆదిపురుష్ మూవీ బీట్ చేయగలిగింది. 3డీలో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడటానికి ఆసక్తి చూపించారు. పిల్లలకి కూడా భాగా కనెక్ట్ అయ్యింది. ఈ కారణాలు కూడా కలెక్షన్స్ ఎక్కువ రావడానికి కారణం అయ్యింది.
అయితే బ్రేక్ ఎవెన్ మాత్రం ఆదిపురుష్ మూవీ ఇంకా అందుకోలేదని చెప్పాలి. వరల్డ్ వైడ్ గా కూడా ఇంకా బ్రేక్ ఎవెన్ సాధించలేదు. నిలకడగా మరో వారం రోజులు ఆదిపురుష్ చిత్రానికి ఆదరణ వస్తే బ్రేక్ ఎవెన్ ని అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.