Begin typing your search above and press return to search.
ఆ రూమర్లపై రెబల్ స్టార్ ఫైర్
By: Tupaki Desk | 15 Nov 2019 9:39 AM GMTసీనియర్ నటుడు.. కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సోషల్ మీడియా ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆయన న్యూమోనియాకు చికిత్స పొందుతున్నారని ఆస్పత్రి ఐసీయూలో ఉన్నారని ఎడా పెడా సామాజిక మాధ్యమాల్లో వార్తలు ప్రచురితం అయ్యాయి.
అయితే ఇది నిజమా? ఆయనకు అంత సీరియస్ అయ్యిందా? అంటే అవన్నీ వట్టి పుకార్లేనని తేలింది. రెగ్యులర్ చెకప్ కోసమని ఆస్పత్రికి వెళితే ఇలా లేనిపోని పుకార్లు పుట్టించారు. ఈ తరహా పుకార్లతో అభిమానులు చాలా కంగారు పడ్డారు. ఆయన త్వరగా కోలుకుని తిరిగి యథాస్థితికి రావాలని ప్రార్థనలు చేశారు. తాజాగా ఈ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ.. రెబల్ స్టార్ కృష్ణం రాజు కుటుంబీకులు స్వయంగా ఆన్సర్ ఇచ్చారు. ఓ అధికార ప్రకటనను విడుదల చేశారు.
న్యూమోనియాకు చికిత్స చేయించుకోవడంతో పాటు రెగ్యులర్ గా చేయించుకునే ఆరోగ్య పరీక్షల నిమిత్తం కేర్ హాస్పిటల్ కు వెళ్ళటం చూసిన కొన్ని పత్రికలు నిజానిజాలేమిటో తెలుసుకోకుండా అలా రాసేశాయి. కనీస విషయసేకరణ లేకుండా నిరాధారమైన వార్తలు ప్రచురించారు! అంటూ ఫైర్ అయ్యారు. కృష్ణంరాజుకు అనారోగ్యం అనగానే.. అభిమానులు పరిశ్రమ వర్గాల పరామర్శలతో ఆస్పత్రిలో ఉండగానే బోలెడంత ఇబ్బందికి గురయ్యామని రెబల్ స్టార్ కుటుంబీకులు వెల్లడించారు. 'ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా బాగుంది. డాక్టర్ల పరీక్షలు పూర్తయిన వెంటనే ఇంటికి వెళతాను. నా ఆరోగ్యం విషయంగా ఆందోళన వ్యక్తం చేసిన అభిమానులకు ధన్యవాదాలు' అని కృష్ణంరాజు తెలిపారు.
ప్రతిసారీ సెలబ్రిటీలపై ఈ తరహా వార్తలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. నిజనిర్ధారణ చేసుకోకుండా.. కుటుంబ సభ్యుల్ని కనుక్కోకుండా ప్రధాన మీడియా మధ్యమాలే ఇలా చేసేస్తుండడంతో ఇతర మీడియా మాధ్యమాల్లోనూ అవి వైరల్ అయిపోతున్నాయి. దీనివల్ల ఫ్యాన్స్ లో కంగారు తప్పడం లేదు. ఈ పరిస్థితి మారాలనే కోరుకుందాం.