Begin typing your search above and press return to search.
అశ్రునయనాల మధ్య రెబల్ స్టార్ కు వీడ్కోలు!
By: Tupaki Desk | 12 Sep 2022 11:16 AM GMTప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అంత్యక్రియలు ముగిశాయి. అశ్రు నయనాల మధ్య కృష్ణంరాజుకు ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు వీడ్కోలు పలికారు. ఆదివారం తీవ్ర అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. ఆయితే ఆదివారం పరిస్థితి విషమించడంతో కృష్ణంరాజు తుది శ్వాస విడిచారు. ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ ...కృష్ణంరాజు దహన సంస్కారాలు నిర్వహించారు.
ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణంరాజు దహన సంస్కారాలు జరిగాయి. సోమవారం మధ్యాహ్నం జూబ్లీ హిల్స్ లోని ఆయన నివారం నుంచి మొయినా బాద్ లోని కనకమామిడి ఫామ్ హౌస్ వరకు కృష్ణంరాజు పార్ధీవ దేహనికి అంతిమ యాత్రని నిర్వహించారు.
సోమవారం ఉదయమే కనకమామిడి ఫామ్ హౌస్ లో అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లని పూర్తి చేశారు. దీంతో అభిమాన నటుడు కృష్ణంరాజు పార్ధీవ దేహాన్ని చూసేందుకు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, అభిమానులు పెద్ద సంక్షలో అక్కడికి చేరుకున్నారు.
భారీ సంఖ్యలో అభిమానులు మొయినా బాద్ లోని కనకమామిడి ఫామ్ హౌస్ కు చేరుకోవడంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జకగకుండా పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు.
ముందు కుటుంబ సభ్యులు మహా ప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు జరపాలని నిర్ణయించారు. అయితే వేదపండితుల సలహా మేరకు మొయినా బాద్ లోని కనకమామిడి ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు నిర్వహించాలని మార్పు చేశారు.
దాంతో మధ్యాహ్నం జరిగాల్సిన అంత్యక్రియలు సాయంత్రానికి వాయిదాపడ్డాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడంతో గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు కృష్ణంరాజు పార్ధీవ దేహానికి గౌరవ వందనం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా అభిమానుల్ని ఇతరుల్ని అంత్యక్రియలు జరుగుతున్న ఫామ్ హౌస్ లోకి పోలీసులు అనుమతించకపోవడంతో కొంత మంది అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.