Begin typing your search above and press return to search.

సినిమానే జీవితం కాదు.. బాగా చెప్పావ్‌ యామి

By:  Tupaki Desk   |   31 May 2022 2:30 PM GMT
సినిమానే జీవితం కాదు.. బాగా చెప్పావ్‌ యామి
X
సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారు చాలా మంది కెరీర్‌ ఆరంభంలో మరియు కెరీర్‌ లో సక్సెస్ అయ్యి బిజీ అయిన వారు కూడా తమ వ్యక్తిగత జీవితాన్ని సినిమా కోసం త్యాగం చేసినట్లుగా చెబుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని కోరుకున్నా కూడా అది సాధ్యం కావడం లేదు అంటూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత మాత్రాన అసలు ఈ ప్రపంచంకు దూరంగా బతికేస్తున్నట్లుగా చాలా మంది బ్రమ పడుతూ ఉంటారు.

యామి గౌతమ్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు అలా ఆలోచించే వారికి గట్టి సమాధానం అన్నట్లుగా ఉన్నాయంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాజాగా ఒక చిట్ చాట్ లో యామి గౌతమ్‌ మాట్లాడుతూ తాను సినిమా ను జీవితం అన్నట్లుగా చూడను అంది. జీవితంలో ఒక పార్ట్‌ గా మాత్రమే సినిమాను చూస్తాను. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా నేను నా కుటుంబ సభ్యులతో సమయం గడుపుతాను... ఇస్టమైనవి తింటాను.. ఉండాలనుకున్న విధంగా ఉంటాను.

వృత్తి జీవితం మరియు పర్సనల్‌ జీవితంను ఎప్పుడు కూడా వేరు వేరుగానే చూడాలి. అలా చూసినప్పుడు మాత్రమే జీవితంలో సంతోషం ఉంటుంది. జీవితంలో సినిమా తప్ప మరేమి లేదు అనుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవితంలో సినిమా తప్ప మరేం కనిపించవు. అప్పుడు ఎంతగా బాధ పడ్డా కూడా ప్రయోజనం మాత్రం శూన్యం అన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది.

హీరోయిన్ గా వరుస సినిమాలు చేయాలనే కోరిక ఏమీ లేదు. అంది వచ్చిన అవకాశాలను చేస్తూ నా వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉండాలి అనేది నా కోరిక అన్నట్లుగా యామి గౌతమ్‌ చెప్పుకొచ్చింది. మోడల్‌ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన యామి గౌతమ్‌ ఇప్పుడు బాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో ఎంతో మందితో నటించి స్టార్‌ గా గుర్తింపు దక్కించుకుంది.

వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్‌ ను కూడా కమిట్‌ అయ్యి సినిమాల సంఖ్య పెంచుకోకుండా అర కొర సినిమాలు చేస్తూ తన సినీ కెరీర్‌ ను మరియు తన వ్యక్తిగత జీవితాన్ని సాఫీగా ముందుకు తీసుకు వెళ్తుంది.

ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత జీవితం కు ప్రాముఖ్యత ఇచ్చుకోవాలని.. కుటుంబ సభ్యులకు ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల వృత్తిపరంగా కూడా సక్సెస్ లు ఉంటాయి అన్నట్లుగా లైఫ్ లెసన్స్ ను చెప్పుకొచ్చింది. అందుకే యామి గౌతమ్ ను బాగా చెప్పావ్‌ యామి అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.