Begin typing your search above and press return to search.
నిఖిల్ చెప్పబోతున్న అతిపెద్ద ప్రపంచ రహస్యం ఏంటి?
By: Tupaki Desk | 1 Jun 2022 5:24 AM GMTయంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ 'కార్తికేయ' ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే. ఈ విజయంతో నిఖిల్ కి ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. నటుడిగా తనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో ఇదొక డిఫరెంట్ అటెంప్ట్ గా నిలిచింది.
తొలి సినిమా విజయంతోనే చందు మొండేటికి మంచి పేరొచ్చింది. విమర్శకుల ప్రశంలందుకున్నాడు. నటుడిగా నిఖిల్..మేకర్ గా చందు ఇండస్ర్టీలో బిజీ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరు వేర్వేరు సినిమాలకు పనిచేసారు. కానీ 'కార్తికేయ -2' ఆలోచనలు మాత్రం మరోవైపు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా కార్తికేయకి సీక్వెల్ గా 'కార్తికేయ-2' ప్రకటనతో ద్వయం ముందుకొచ్చింది.
ఈ ప్రాజెక్ట్ ప్రకటనతోనే అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. ఈసారి ఎలాంటి థ్రిల్లర్ అంశాలతో ముందుకు రాబుతున్నారు? ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ ఎలా ఉండబోతుంది? సమాధానం లేని ప్రశ్న అంటూ ఏది ఉండదని భావించిన ద్వయం ఈసారి ఎలాంటి ప్రశ్న..బధులుతో రాబోతున్నారు? అన్న ఎగ్జైట్ మెంట్ పెరిగిపోతుంది.
తాజాగా కొద్ది సేపటి క్రితమే ఫస్ట్ లుక్ ..మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు. దీంతో సినిమాపై ఓ అవగాహనకు రావొచ్చని తెలుస్తోంది. ఈ సారి ఏకంగా సముద్రంపైనే సావాసానికి దిగారు. భారీ ఉరుములు..మెరుపులు పక్షుల కిల కిలతో భయాన్ని కల్గించే ప్రయత్నం చేసారు. నిఖిల్..అనుపమ...జ్యోతిష్యుడు గెటప్ లో ఉన్న శ్రీనివాసరెడ్డి నాటు పడవపై ప్రయాణం చేస్తూ కనిపిస్తున్నారు.
"సముద్రం దాచుకున్న అతిపెద్ద ప్రపంచ రహస్యం ఈ ద్వారకా నగరం అంటూ సినిమా లో ఇంట్రెస్టింగ్ పాయిట్ ని రివీల్ చేసారు. ఆ ద్వారాక నగరంలో కథ అంతా సాగుతుందని తెలుస్తోంది. ఆ ద్వారక నగరం సముద్రంలో ద్వీపం అయిండొచ్చు. మరి ఈ త్రయానికి ఎదురైన ప్రశ్న ఏంటి? అందుకు ఆ ద్వారకా నగరం ఎలాంటి సమాధానం ఇస్తుందన్నది తెలియాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. బీజీఎమ్ ఆకట్టుకుంటుందతి. శ్రీకృష్ణుడికి సంబంధించిన చరిత్ర.. ద్వారకా నగరం మీద అన్వేషణ నేపథ్యంలో సాగే స్టోరీలా కనిపిస్తుంది. ఇందులో నిఖిల్ యధావిధిగా వైద్యుడి పాత్రలో కనిపించనున్నారు. టీజర్..ట్రైలర్ తో ఇంకాస్త క్లారిటీ దొరికే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.
అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పడుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో రిలీజ్ కి సమయం పడుతుంది. జూలై 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రాన్ని పీపూల్స్ మీడియా ఫ్యాక్టరీ- అభిషేక్ అగర్వాల్ ఆర్స్ట్ పతాకాలపై టీజీ ప్రసాద్- అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియా కేటగిరీలో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. తెలుగు..తమిళ్..హిందీ..కన్నడ..మలయాళం భాషల్లో రిలీజ్ అవుతుంది. నిఖిల్ నటించిన సినిమా ఇన్ని భాషల్లో రిలీజ్ అవ్వడం ఇదే తొలిసారి.