Begin typing your search above and press return to search.

చైతూ చాలా మంచోడు.. విడాకులు ఎందుకో తెలియదు

By:  Tupaki Desk   |   6 Oct 2021 11:40 AM GMT
చైతూ చాలా మంచోడు.. విడాకులు ఎందుకో తెలియదు
X
నాగ చైతన్య మరియు సమంతలు విడిపోతున్న విషయం అధికారికంగా ప్రకటించారు. చాలా విధాలుగా ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వారు పేర్కొన్నారు. ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు ఈ విషయమై స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. అదే సమయంలో విడాకులు తీసుకోవడం వారి వ్యక్తిగత విషయం. ఇద్దరు ఆలోచించుకుని ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారు. వారి నిర్ణయాన్ని అందరం గౌరవించాలి. వారి విషయంలో అంతా మంచి జరగాలని మనం కోరుకోవాలి తప్ప విడాకుల విషయంలో రాద్దాంతం చేసి విమర్శలు చేయవద్దని చాలా మంది మాట్లాడారు. తాజాగా రాజీవ్‌ కనకాల కూడా ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని మాట్లాడటం జరిగింది. విడాకులు ఎందుకు తీసుకున్నారో నాకు తెలియదు.. చైతూ మాత్రం చాలా మంచి వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపించాడు.

రాజీవ్‌ కనకాల ఇటీవల నాగ చైతన్య లవ్‌ స్టోరీ సినిమాలో నటించాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రాజీవ్ కనకాల పాత్రకు కూడా మంచి మార్కులు పడ్డాయి. విలన్ గా రాజీవ్ కనకాల సినిమాకు హైలైట్ గా నిలిచాడు అంటూ చాలా మంది చాలా రకాలుగా అభినందించారు. ఈయన నటిస్తున్న సినిమాలు కొన్నే అయినా కూడా మంచి నటనతో పేరు దక్కించుకుంటున్నాడు. ఎంతో మంది ప్రముఖ స్టార్స్ తో నటించిన రాజీవ్ కనకాల చైతూ మూవీలో విలన్ గా నటించాడు. అలాంటి రాజీవ్‌ కనకాల ఇంటర్వ్యూలో చైతూ గురించి పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు. రెండు బిగ్‌ ఫ్యామిలీలకు చెందిన హీరో అయినా కూడా చైతూ కు ఏమాత్రం ఆ ఫీలింగ్‌ ఉండదు. ఒక సింపుల్‌ మ్యాన్ అన్నట్లుగా కనిపిస్తాడు.

షూటింగ్‌ సెట్‌ లో చైతూ ను చూస్తుంటే ముచ్చటేస్తుంది అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. ఏం చేసినా.. ఎంత చెప్పినా కూడా విసుగు అనేది ఆయన మొహంలో కనిపించదు. నవ్వుతూనే ఉండే చైతూ ప్రతి ఒక్కరిని సెట్‌ లో గౌరవిస్తూ ఉంటాడు. అమ్మాయిలు మాత్రమే కాకుండా అబ్బాయిలు కూడా అతడిని ఇష్టపడేలా ప్రవర్తిస్తూ ఉంటాడు. సెట్స్ కు కొందరు హీరోలు వచ్చిన సమయంలో హడావుడి ఉంటుంది. కాని చైతూ ఎప్పుడు వస్తాడో తెలియదు. వచ్చి అలా పక్కకు ఉంటాడు. తాను ఒక పెద్ద ఫ్యామిలీ హీరోను అనే గర్వం కాని.. ఈగో కాని అతడిలో ఎప్పుడు చూడలేదు. అలాంటి నాగచైతన్య నుండి సమంత ఎందుకు విడిపోయిందో తెలియదు అంటూ రాజీవ్ కనకాల చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. చైతూ అభిమానులు ఈ రాజీవ్‌ వ్యాఖ్యలను సోషల్‌ మీడియా ద్వారా తెగ షేర్‌ చేస్తూ కొందరు సమంతను ట్రోల్‌ చేస్తున్నారు.