Begin typing your search above and press return to search.
శంకర్ టార్గెట్ 3 నెలలు..తెలుగు వాళ్లకు ఛాన్స్!
By: Tupaki Desk | 27 Sep 2021 3:33 PM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమా ప్రారంభోత్సవం జరిగింది. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం చరణ్ `ఆర్ ఆర్ ఆర్` పనుల్లో బిజీగా ఉండగా..శంకర్ సినిమాకు సంబంధిచిన వర్క్స్ లో తలమునకలై ఉన్నారు. తాజాగా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. సినిమా ఎంత వేగంగా పట్టాలెక్కిందో అంతే వేగంగా చిత్రీకరణ కూడా పూర్తిచేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారుట. స్టార్ మేకర్ గత చిత్రాల్లా కాకుండా వీలైంనత త్వరగా షూటింగ్ సహా అన్ని పనులు పూర్తిచేసి రిలీజ్ చేయాలని భావిస్తున్నారుట.
దీనిలో భాగంగా టీమ్ ని సైతం అప్పుడే అప్రమత్తం చేసినట్లు సమాచారం. కేవలం టాకీ పార్టునే మూడు నెలల్లో ఎట్టిపరిస్థితుల్లో పూర్తిచేయాలని..ఆ రకంగా ప్రణాళిక మొత్తం సిద్దగ చేయాలని యూనిట్ ని ఆదేశించినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే చిత్రీకరణ ఎక్కువ భాగం ఎక్కడ జరుగుతుందన్న వివరాలు బయటకు వస్తే గానీ ఎంత వేగంగా పూర్తవుతుంది అన్న దానిపై మరింత క్లారిటీ దొరికే ఛాన్స్ ఉంది. అయితే ఇది తెలుగు సినిమా కాబట్టి శంకర్ కొత్తగా తెలుగు వాళ్లను తన టీమ్ లో జాయిన్ చేసుకుంటారా? లేక పూర్తిగా కోలీవుడ్ టీమ్ తోనే ముందుకు వెళ్తారా? అన్నది కూడా తెలియాలి.
శంకర్ సినిమాలు సాధారణంగా ఎక్కువ నెలలు పాటు షూటింగ్ జరుగుతుంది. ఆ రకంగా అతని వద్ద ఉన్న ప్రస్తుత టీమ్ ని ఒక్కసారిగా స్పీడప్ చేయడం అంటే చిన్న విషయం కాదు. దానికి కొంత గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ విధంగా ఆయన సిద్దంగా ఉన్నారా? అన్నది తెలియాలి. ఇక ఇందులో ఓ కీలక పాత్రలో తమిళ నటుడు ప్రభు పోసిస్తున్నట్లు సమాచారం. అలాగే కన్నడ నటుడు కిచ్చా సుదీప్ అతిధి పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది. ఇలా సౌత్ లో ఫేమస్ అయిన నటుల్ని శంకర్ చరణ్ ప్రాజెక్ట్ లో భాగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో చరణ్ కి జోడీగా కియారా అద్వాణీ నటిస్తోన్న సంగతి తెలిసిందే.