Begin typing your search above and press return to search.

ఏంటీ..ఇది పాటా లేక ఏదైనా మాయా..150 మిలియన్ వ్యూసా..!

By:  Tupaki Desk   |   2 May 2020 1:00 PM GMT
ఏంటీ..ఇది పాటా లేక ఏదైనా మాయా..150 మిలియన్ వ్యూసా..!
X
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ 'అల వైకుంఠపురములో'. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. హాసిని అండ్ హారిక ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు నిర్మించిన ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు. గతంలో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'జులాయి' 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలు మ్యూజిక్ పరంగా ఎంతగా సక్సస్ ని అందుకున్నాయో అందరికి తెలిసిందే. ఇప్పుడు 'అల వైకుంఠపురములో' ఆల్బమ్ అంతకంటే పెద్ద సక్సస్ అయింది. ఈ సినిమా రిలీజ్ కాకముందే థమన్ తన మ్యూజిక్ తో సినిమా బ్లాక్ బస్టర్ అన్న నమ్మకాన్ని తన మ్యూజిక్ ఆల్బమ్ ద్వారా క్రియేట్ చేసాడు. ఈ సినిమాలో సాంగ్స్ అన్ని సూపర్ హిట్టయ్యాయి. ముఖ్యంగా 'సామజవరగమన' 'బుట్ట బొమ్మ' 'రాములో రాములా' సాంగ్స్ సెన్షేషన్ ని క్రియేట్ చేశాయి.

వాటిలో ముఖ్యంగా 'బుట్ట బొమ్మ' సాంగ్ విశేషంగా ఆకట్టుకొని ఎన్నో రికార్డులను సృష్టించింది. ఒక పాటకు స్వరం ఎంత ముఖ్యమో సాహిత్యం కూడా అంతే ముఖ్యం. సంగీత దర్శకుడు ఇచ్చిన ట్యూన్ ఎంత బాగున్నా.. ఆ పాటలోని సాహిత్యం అర్థంపర్థం లేకుండా ఉంటే వినలేం. అలాగే.. సాహిత్యం ఎంత బాగున్నా దానికి అనువైన సంగీతం జత కుదరకపోయినా పాటను వినలేం. ఈ అన్నింటి కలయికలో వచ్చిన ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. ‘ఇంత కన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో.. బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను చుట్టుకుంటివే..’ అని సాగిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు. ఈ పాటకి బ‌న్నీ డాన్స్ గ్రేస్.. త‌మ‌న్ ట్యూన్స్.. అర్మాన్ మాలిక్ గొంతు.. రాంజో సాహిత్యం క‌ల‌గలిపి 'బుట్ట‌బొమ్మ‌'ను జ‌నాల గుండెల్లోకి సూటిగా గుచ్చేసాయి. ఏకంగా 150 మిలియన్ సార్లు బుట్ట‌బొమ్మ‌ని వినేశారు శ్రోత‌లు. ఏంటి.. ఇది పాట లేక ఏదైనా మాయా అని ఆశ్చర్యపోయే రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ప్రస్తుతం ఇండియా వైడ్ ట్రెండింగ్ లో ఉంది ఈ పాట. ఆ మాట‌కు వ‌స్తే ప్రపంచ సంగీత అభిమానులంద‌రి చెవుల్ని మారు మోగిస్తోంది. ఈ మ్యూజిక్ రైట్స్ కొనుకున్న ఆదిత్య మ్యూజిక్ కంపెనీ వారు దాదాపు ఈ పాట పై 8 కోట్ల వ‌ర‌కు రెవెన్యూ రాబ‌ట్టారట. అంతేకాకుండా 'అల వైకుంట‌పురంలో' ఆల్బ‌మ్ ద్వారా వివిధ మ్యూజిక్ ఫ్లాట్ ఫామ్స్ ఇచ్చే రాయ‌ల్టీ ప‌ద్ధ‌తిలో ఆదిత్య మ్యూజిక్ వారికి ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 26 కోట్లు వ‌ర‌కు బిజినెస్ జ‌రిగింద‌ని ట్రేడ్ వర్గాల టాక్. ఏదేమైనా 'అల వైకుంఠపురములో' సినిమా విజయంలో మేజర్ క్రెడిట్ ఈ సినిమా పాటలకే దక్కుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.