Begin typing your search above and press return to search.

OTT లో క్రేజీ ఫ్లాప్ స్టార్ గా రికార్డులు..!

By:  Tupaki Desk   |   19 Aug 2021 9:30 AM GMT
OTT లో క్రేజీ ఫ్లాప్ స్టార్ గా రికార్డులు..!
X
కీర్తి సురేష్ న‌టించిన పెంగ్విన్ ఇంత‌కుముందు ఓటీటీలో రిలీజైన సంగ‌తి తెలిసిందే. థియేట్రిక‌ల్ రిలీజ్ కి ఆస్కారం లేక‌పోవ‌డంతో ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేశారు. అయితే ఈ హార‌ర్ థ్రిల్ల‌ర్ ఓటీటీ లో అంత‌గా ఆద‌ర‌ణ ద‌క్కించుకోలేదు. ప్ర‌తికూల స‌మీక్ష‌ల‌తో విఫ‌ల‌మవ్వ‌డంతో ఆ అనుభ‌వాన్ని ఇప్ప‌టికీ కీర్తి మ‌ర్చిపోలేక‌పోతోంద‌ట‌. అయినా కీర్తి సినిమాలు వ‌రుస‌గా ఓటీటీల్లోకి వ‌స్తుండ‌డం విశేషం.

2020లో మహమ్మారి వ్యాప్తి చెందిన త‌ర్వాత‌ కీర్తి సురేష్ న‌టించిన‌ రెండు సినిమాలు పెంగ్విన్ .. మిస్ ఇండియా థియేట్రికల్ విడుదలను వ‌దులుకుని వరుసగా అమెజాన్ ప్రైమ్ వీడియో నెట్ ఫ్లిక్స్ లో ప్రత్యక్ష OTT ప్రీమియర్ గా ప్ర‌ద‌ర్శించారు. అయితే ఈ రెండు సినిమాలకు విమర్శకులు ప్రేక్షకుల నుండి తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇటీవల గుడ్ లక్ సఖి కూడా నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ అవుతుందని క‌థ‌నాలొచ్చాయి. కానీ మేకర్స్ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పుడు జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ న‌టించిన‌ మరో చిత్రం OTTలో విడుద‌ల‌వుతుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కీర్తి న‌టించిన‌ తమిళ క్రైమ్ డ్రామా `సాని కయిధం` డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధ‌మ‌వుతోంద‌ని కోలీవుడ్ మీడియాలో గుస‌గుస వినిపిస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

కీర్తితో పాటు ఈ చిత్రంలో ప్ర‌ముఖ తార‌లు న‌టించారు. తమిళంలో ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ నటించిన తొలి చిత్రం సాని కయిధం. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని స్క్రీన్ సీన్ బ్యానర్ పై నిర్మించారు. ఓటీటీలో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లు ఎదుర్కొని కీర్తి రేసులో వెన‌క‌బ‌డింది.

ఇక ఫ్యామిలీమ్యాన్ 2 సీజ‌న్ తో స‌మంత‌కు గొప్ప పేరు రాగా కీర్తి త‌ర‌హాలోనే కాజ‌ల్ కూడా ఓటీటీలో విఫ‌ల‌మైంది. కాజ‌ల్ న‌టించిన ఓటీటీ హార‌ర్ సిరీస్ `టెలీకాస్ట్` ఆద‌ర‌ణ ద‌క్కించుకోని సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల త‌మ‌న్నా న‌టించిన ఓటీటీ సిరీస్ లెవెంత్ అవ‌ర్ కి మాత్రం చ‌క్క‌ని పేరొచ్చింది.

డిజిట‌ల్ వైపు హీరోలు అడుగులు

హీరోయిన్ లే కాదు.. స్టార్ హీరోలు కుర్రహీరోలు అనే తేడా లేకుండా తార‌లు ఓటీటీ బాట ప‌డుతున్నారు. పెద్ద తెర .. డిజిట‌ల్ అనే విభేధం ఇప్పుడు లేదు. నిజానికి పెద్ద తెర కంటే ఓటీటీలో పెద్ద పేరు తెచ్చుకున్న స్టార్లకు కొద‌వేమీ లేదు. ఇటీవ‌ల అక్కినేని కోడ‌లు స‌మంత ఫ్యామిలీమ్యాన్ 2 తో అద‌రగొట్టిన నేప‌థ్యంలో హ‌బ్బీ నాగ చైతన్య అక్కినేని డిజిట‌ల్ ఎంట్రీ గురించి చాలా కాలంగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. చైతూ స‌రైన టైమ్ కోసం వేచి చూస్తున్నారు. ప్రస్తుతం అత‌డు తెలుగు చిత్రం థాంక్స్.. హిందీ చిత్రం లాల్ సింగ్ చద్దాతో బిజీగా ఉన్నారు. OTTలో తొలిసారిగా ఒక ప్రొడక్షన్ హౌస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చార‌ని తెలిసింది. కింగ్ నాగార్జున కూడా త్వ‌ర‌లో ఓటీటీ ఆరంగేట్రానికి స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. హీరో కం నిర్మాత క‌ళ్యాణ్ రామ్ ఓటీటీ సిరీస్ ల‌కు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు.

నిర్మాత‌ల వార‌సులు ఓటీటీ ప్లాన్స్..

అలాగే ప‌లువురు అగ్ర నిర్మాత‌లు సొంత ఓటీటీల‌తో త‌మ వార‌సుల‌ను ప్ర‌మోట్ చేయాల‌న్న ప్ర‌ణాళిక‌తో ఉన్న‌ట్టు కూడా క‌థ‌నాలొస్తున్నాయి. ప‌లువురు న‌ట‌వార‌సులు ఓటీటీల‌తో ప‌రిచ‌య‌మై సినిమాల్లో న‌టించ‌నున్నార‌ని టాలీవుడ్ ఇన్ సైడ్ గుస‌గుస వినిపిస్తోంది. ఇక బాలీవుడ్ లో షారూక్ వార‌సురాలు స‌హానా.. సైఫ్ ఖాన్ వార‌సుడు ఇబ్ర‌హీం అలీఖాన్.. శ్రీ‌దేవి వార‌సురాలు ఖుషీ క‌పూర్ కూడా ఓటీటీ సిరీస్ ల‌తోనూ తెర‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.