Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: రెడ్ హాట్ మలైకం
By: Tupaki Desk | 14 Nov 2019 12:57 PM GMTఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ ని ఫాలో చేయడంలో మలైకా స్పీడ్ గురించి చెప్పాల్సిన పనేలేదు. బాలీవుడ్ లో ఉన్న మోస్ట్ స్టైలిష్ ఫ్యాషనిస్టాగా తనకు పాపులారిటీ ఉంది. 16 ఏజ్ నుంచి 60 ఏజ్ వరకూ మలైకా స్టైల్స్ గురించి ముచ్చటిస్తారంటే ఏ స్థాయిలో తనకు పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ముంబైలో జరిగిన ఓ ఫ్యాషన్ ఈవెంట్లో జియాంబట్టిస్టా వల్లి అనే ప్రత్యేకమైన డిజైనర్ డ్రెస్ లో మలైకా తళుక్కుమంది. రెడ్ హాట్ లుక్ లో ఈ అమ్మడు ఇచ్చిన ఫోజు జెట్ స్పీడ్ తో అంతర్జాలంలో వైరల్ అవుతోంది. ఐదున్నర అడుగుల మలైకం ఈ స్పెషల్ డ్రెస్ లో ఈవెంట్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ రెడ్ హాట్ డిజైనర్ డ్రెస్ కి కాంబినేషన్ గా మలైకా మెడలో ముత్యాల హారం అంతే ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
ఇంతకుముందు కేన్స్- 2019 ఉత్సవాల్లో దీపికా పదుకొనే జియాంబట్టిస్టా వల్లి డ్రెస్ లో తళుకుబెళుకులు ప్రదర్శించింది. అప్పట్లో ఆ ఫోటోలు అంతర్జాలాన్ని సునామీలా చుట్టేసాయి. మరోసారి మలైకా సేమ్ డిజైనర్ డ్రెస్ తో ప్రత్యక్షమవ్వడంతో ముంబై ఫోటోగ్రాఫర్లు కెమెరా ఫ్లాష్ లతో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఈ ఫోటోలు చూపరుల్ని కట్టి పడేస్తున్నాయి.
జియాంబటిస్టా వల్లి అనేది హై రేంజ్ బ్రాండ్. ప్రఖ్యాత హెచ్ అండ్ ఎమ్ తో కలిసి ఈ డిజైన్ కి రూపకల్పన చేయడంతో అసాధారణ పాపులారిటీ దక్కించుకుంది. భారతదేశంలోను ఈ డిజైనర్ దుస్తులు ``జియాంబట్టిసా వల్లి x హెచ్ అండ్ ఎం`` పేరుతో పాపులరవుతున్నాయి.