Begin typing your search above and press return to search.
`రెడ్` అలెర్ట్ .. ఇంతకీ రాపో ఒకడా ఇద్దరా?
By: Tupaki Desk | 28 Feb 2020 11:14 AM GMTఇస్మార్ట్ శంకర్ చిత్రం తో బ్లాక్ బస్టర్ విజయం అందుకుని రెట్టించిన ఉత్సాహంతో దూసుకొస్తున్నాడు రామ్ పోతినేని. #రాపో అంటూ షార్ట్ కట్ లో అతడి పేరు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇక రాపోతో నేను శైలజ ఫేం కిషోర్ తిరుమల `రెడ్` అనే ప్రయోగాన్ని చేస్తున్నాడు. ఇదో క్రైమ్ థ్రిల్లర్ మూవీ. రామ్ ఈ చిత్రం లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నివేద- మాళవిక- నాజర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
క్రైమ్ జోనర్ అనగానే అన్ని సినిమాల్లానే రొటీన్ గా ఉంటుంది అని అనుకునేరు.. ! రాపో సంథింగ్ స్పెషల్. అతడు చేసే క్రైమ్ వేరొకరు చేయలేరు. క్రైమ్ హిస్టరీలోనే అలాంటి కేసు వేరొకటి ఉండదు. అందుకే తొలిగా టీజర్ తో ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లే ప్లాన్ లో ఉన్నాడు. 28 ఫిబ్రవరి సాయంత్రం టీజర్ ని వదిలేందుకు రెడ్ టీమ్ ప్రిపరేషన్స్ లో ఉంది. అయితే ఈ టీజర్ ప్రత్యేకత ఏమిటి? అంటే.. ఇందులో రామ్ డబుల్ రోల్ ఆద్యంతం ఎగ్జయిట్ మెంట్ పెంచనుందట. రెండు వేరియేషన్స్ రెండు గెటప్పుల్లో కనిపించే రామ్ 6ప్యాక్ బాడీని ఎలివేట్ చేయనున్నాడని లీకైంది.
ఒక పాత్రలో రఫ్ అండ్ ఠఫ్ గా గుబురు గడ్డంతో డీగ్లామర్ లుక్ తో కిర్రాక్ పుట్టిస్తాడు. మరొక పాత్రలో సాఫ్ట్ గా టక్కు టై కట్టుకుని సాఫ్ట్ బోయ్ లా కనిపిస్తాడు. అయితే రెండు పాత్రలకు గడ్డం కామన్ గా ఉంటుంది. అయితే ఇందులో ఒక పాత్ర ఇంకో పాత్రను ఎందుకని క్రైమ్ లో ఇరికించాలనుకుంటుందో ఆద్యంతం రక్తి కట్టించే స్క్రీన్ ప్లేతో కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని చెబుతున్నారు. రామ్ ఇంతకీ ఇందులో ఒక్కడేనా ఇద్దరా? అన్నదే అసలు సిసలు సస్పెన్స్. రియల్ ఇన్సిడెంట్స్ తీసుకుని కథగా రాసుకుని దానిని తెర పై ఎగ్జిక్యూట్ చేసిన విధానం మెప్పిస్తుందని చెబుతున్నారు. పోలీసులు క్రైమ్ ఇన్వెస్టిగేషన్.. ఎవరికీ చిక్కకుండా క్రిమినల్ తప్పించుకోవడం వగైరా రక్తి కట్టించనున్నాయి. అలాగే రామ్ కెరీర్ లో మరో హిట్టు పడినట్టేనన్న కాన్ఫిడెన్స్ స్రవంతి బ్యానర్ లో వ్యక్తమవుతోందట. మూవీ షేపప్ బావుందన్న టాక్ వినిపిస్తోంది. ఏప్రిల్ 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ట్రైలర్ కంటే ముందే టీజర్ తో వస్తోంది టీమ్. జస్ట్ వెయిట్..