Begin typing your search above and press return to search.
బన్ని కాంట్రాక్ట్ పొడిగించలేదా?
By: Tupaki Desk | 18 April 2019 7:48 AM GMTస్టార్ హీరోలు ఓవైపు సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తూ నాలుగు చేతులా ఆర్జిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పలు టాప్ రేంజ్ వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ టాలీవుడ్ లో మహేష్ తర్వాత ఆ స్థాయిలో టాప్ ఎర్నర్స్ గా పేరు తెచ్చుకున్నారు. భారీ కార్పొరెట్ బ్రాండ్ల (ఫ్రీటీలు, కోలాలు వగైరా)కు బ్రాండ్ అంబాసిడర్ గా బన్నికి పాపులారిటీ ఉంది. గత ఏడాది రెడ్ బస్ పోర్టల్ కి అతడు ప్రచారకర్తగా పని చేశారు. కానీ ఈసారి ఏమైందో ఆ ప్రకటనకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎం.ఎస్.ధోనీతో రీప్లేస్ చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ డీల్ విలువ రూ.3కోట్ల నుంచి రూ.10 కోట్ల మధ్య ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇంతటి ప్రతిష్ఠాత్మక బ్రాండ్ ని అల్లు అర్జున్ ఎందుకని వదులుకున్నారు? అంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. బన్నికి ప్రకటనల్లో నటించేందుకు సరిపడనంత సమయం లేకే వదులుకున్నారా? లేక రెడ్ బస్ వాళ్లే కాదనుకున్నారా? అంటూ ముచ్చటించుకుంటున్నారు.
ఈసారి రెడ్ బస్ సంస్థ ఎం.ఎస్.ధోనీనే ఎంపిక చేసుకోవడానికి కారణం జాతీయ స్థాయిలో మార్కెట్ ని విస్తరించే ఆలోచన ఉండడమేనన్న వాదనా మరోవైపు వినిపిస్తోంది. ఎం.ఎస్.ధోని వరల్డ్ వైడ్ పాపులారిటీ తమకు లాభిస్తుందని సదరు సంస్థ భావిస్తోందిట. అయితే బన్ని వైపు నుంచి పరిశీలిస్తే అతడు ఇప్పటికిప్పుడు వరుసగా మూడు సినిమాలతో బిజీ. కెరీర్ 19వ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రారంభించాడు. అలాగే 20వ సినిమాని సుకుమార్ దర్శకత్వంలో, 21వ సినిమాని వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు మల్టీప్లెక్స్ బిజినెస్ పైనా బన్ని దృష్టి సారించారని వార్తలొస్తున్నాయి. ఏషియన్ సినిమాస్ తో కలిసి అమీర్ పేట సత్యం థియేటర్ ఏరియాలో అల్లు అర్జున్- అరవింద్ బృందం భారీగా మల్టీప్లెక్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ డైరీలో 2019-20 సీజన్ అస్సలు ఖాళీ లేదు కాబట్టి అదనపు శ్రమ తీసుకోవడం లేదా? అన్నది ఫ్యాన్స్ పాయింట్. ఇకపోతే రెడ్ బస్ ప్రచార కర్తగా ధోనీ వ్యవహరించడంతో దానిని గౌరవంగా భావిస్తున్నామని, ఇక నుంచి రెడ్ బస్‌కు సంబంధించిన అన్ని యాడ్స్‌లలో ధోనీ మాత్రమే కనిపిస్తారని సదరు కంపెనీ ప్రకటించింది. రెడ్ బస్ కోసం ధోనీ బల్ బీర్ సింగ్ గెటప్‌లోకి మారారు. ఆ ప్రకటన సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్‌లోనూ వైరల్‌గా మారింది. కోర మీసాలు.. ఎరుపు రంగు దుస్తుల్లో హీమాన్ తరహాలో కనిపిస్తున్న ధోనీ లుక్ కి ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్.