Begin typing your search above and press return to search.
రాఘవుడి భారం రెడ్డి మీదే!
By: Tupaki Desk | 20 Sep 2018 7:41 AM GMTస్టార్ హీరోలు ఏ కథతో సినిమా చేసినా వాటిలో తగిన రీతిలో కొన్ని మాసాలాలు ఉండటం తప్పనిసరి. లేకపోతే అభిమానులకే కాదు మాస్ ప్రేక్షకులు సైతం లోటుగా ఫీలవుతారు. ఎన్టీఆర్ మొదలుకుని మహేష్ బాబు దాకా వీళ్ళను డీల్ చేసిన దర్శకులందరూ ఫాలో అయిన ప్రాధమిక సూత్రం ఇదే. అందులోనూ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండే జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోల విషయంలో వీటిని ఇంకాస్త అదనంగా దట్టించాల్సిందే. కానీ త్రివిక్రమ్ తో తారక్ మొదటిసారి జట్టుకట్టిన అరవింద సమేత వీర రాఘవ విషయంలో మాత్రం ఫ్యాన్స్ కొంత అయోమయంలో పడుతున్నారు. కారణం ఆల్బం మొత్తంలో కేవలం నాలుగే పాటలు ఉండటం. అందులో రెండు విడుదలైపోయాయి. ఫస్ట్ ది హీరోయిన్ అరవిందను వర్ణించే ఫాస్ట్ మెలోడీ కావడంతో మరీ రచ్చ చేసే స్టెప్స్ కు అవకాశం ఉండదు. నిన్న రిలీజ్ చేసిన పెనివిటి పాట గుండెలు పిండేసే ఎమోషనల్ సాంగ్ కావడంతో ఆశించడానికి లేదు.
ఇక మిగిలింది రెండు పాటలు. ఏడ పోయినాడో అనే సిరివెన్నెల సాహిత్యంతో సాగేది ఒకటి కాగా రామజోగయ్య శాస్త్రి రాసిన రెడ్డి ఇక్కడ చూడు రెండోది. ఫస్ట్ ది పెంచల్ దాస్ తో పాటు నికిత కైలాష్ ఖేర్ లు పాడారు కాబట్టి అది కీలకమైన సందర్భాన్ని బట్టి వచ్చే థీమ్ సాంగ్ గా కనిపిస్తోంది. కానీ రెడ్డి ఇక్కడ చూడు హుషారైన గీతాలు పాడటంలో ప్రత్యేకమైన శైలి కలిగిన దలేర్ మెహందీ అంజనా సౌమ్యలు పాడారు. సో ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ఇచ్చే మాస్ ఐటెం డాన్స్ సాంగ్ ఇదే అని చెప్పొచ్చు. కానీ ఇలా ఒకటి రెండు పాటలతో అభిమానులు సర్దుకుంటారా అంటే చెప్పడం కష్టమే. జైలవకుశలో మంచి ఊపున్న పాటలు పెట్టడమే కాదు అదనంగా తమన్నాను తీసుకొచ్చి మరీ అదరగొట్టారు. సో అరవింద సమేత వీర రాఘవ విషయంలో ఫ్యాన్స్ సర్దుకోకతప్పదు. అందుకే భారం మొత్తం రెడ్డి పాట మీదే పడుతోంది. పూర్తి ఆల్బమ్ ఈ రోజు సాయంత్రం విడుదల కానుంది.