Begin typing your search above and press return to search.
తాప్సీ ఎగ్జైట్‌మెంట్ దాని కోసమేనా?
By: Tupaki Desk | 10 Jun 2022 2:24 PM GMTప్రస్తుతం పీరియడిక్ మూవీస్ తో పాటు బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇలాంటి కథలకే దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు పట్టంకడుతున్నారు. దీంతో మేకర్స్, స్టార్స్ కూడా రెగ్యులర్ కమర్శియల్ కథలని పక్కన పెట్టి బయోపిక్ లు, పీరియడిక్ మూవీస్ కి ప్రధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు మరో క్రేజీ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రాబోటోంది. ఇండియన్ మహిళా క్రికెటర్, ఇండియన్ మహిళా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న మూవీ `శభాష్ మిథూ`.
టైటిల్ పాత్రలో మిథాలీరాజ్ గా తాప్సీ నటిస్తోంది. ఈ మూవీకి శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. వయాకమ్ 18 స్టూడియోస్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తోంది. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ముంతాజ్ సోర్కర్, విజయ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే క్రేజీ క్రికెటర్స్ బయోపిక్స్ ఎం.ఎస్ థోనీ, కపిల్ దేవ్ బయోపిక్ `83` విడుదలై సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో లేడీ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మహిళా క్రికెట్ కు వన్నెతేవడంలో మిథాలీరాజ్ పాత్ర ప్రత్యేకం. ఆమెని మహిళా సచిన్ టెండూల్కర్ గానూ అభివర్ణిస్తుంటారు. 2017 వరల్డ్ కప్ లో టీమ్‌ని ఫైనల్స్ వరకు తీసుకెళ్లడంలో మిథాలీ రాజ్ ప్రధాన పాత్ర పోషించింది. కెప్టెన్ గా తనదైన ఇన్నింగ్స్ ని ఆడి జట్టుని విజయతీరాల దాకా తీసుకెళ్లింది. అయితే బ్యాడ్ లక్ వెంటాడటంతో జస్ట్ 9 రన్ ల తేడాతో ఫైనల్ లో ఇంగ్లాండ్ పై మిథాలీ టీమ్ ఓటమిని చవిచూసింది.
మహిళా క్రికెటర్ గా మిథాలీ ఎదిగిన క్రమం.. ఈ జర్నీలో తను ఎదుర్కొన్న ఆటుపోట్లు.. అవమానాలు.. విజయాల సమాహారంగా ఈ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాలతో సిద్ధమవుతున్న ఈ మూవీని జూలై 15న వరల్డ్ వైడ్ గా ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన లభించింది. ట్రైలర్ ని ఈ నెల 20న విడుదల చేయబోతున్నారు.
ఈ విషయాన్ని ఇండైరెక్ట్ గా వెల్లడిస్తూ శుక్రవారం తాప్సీ .. మిథాలీతో కలిసి ఫెమీనా మ్యాగజైన్ కోసం ఫొటూ షూట్ లో పాల్గొన్న ఫొటోలని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలకు తాప్సీ ఎగ్జైట్‌మెంట్ లోడింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. తాప్సీ ఎగ్జైట్ అవుతున్నానని చెప్పడానికి కారణం`శభాస్ మిథూ` ట్రైలర్ రిలీజ్ కోసమేనని స్పష్టం అవుతోంది. జూలై 15న విడుదల కానున్న ఈ మూవీ ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.