Begin typing your search above and press return to search.
రియల్ హీరోకి రీల్ `మేజర్` నివాళి
By: Tupaki Desk | 26 Nov 2021 12:30 PM GMTరియల్ హీరో `మేజర్` సందీప్ ఉన్నికృష్ణన్ కి రీల్ `మేజర్` అడవి శేషు నివాళులు అర్పించారు. 26/11 ని పురష్కరించుకుని నేడు ఉన్నికృష్ణన్ జ్ఞాపకాల్ని స్మరించుకుంటూ అతడి తల్లిదండ్రులతో కలిసి అడవి శేషు తాజ్ మహల్ ప్యాలెస్ ని సందర్శించారు. అనంతరం నివాళులు అర్పించారు.
ప్రతీ ఏడాది ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు ఈ విషాద రోజును తాజ్ ప్యాలెస్ వద్ద గడుపుతారు. ఈ ఏడాది వాళ్లతో పాటు అడవి శేష్ సంస్మరణలో పాల్గొన్నారు. 26/11 ముంబై దాడుల్లో ప్రజల ప్రాణాల్ని కాపాడుతూ మేజర్ ఉన్నికృష్ణన్ అమరుడైన సంగతి తెలిసిందే. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఈ సంస్మరణలో శేష్ పాల్గొన్నారు.
మేజర్ ఉన్నికృష్ణన్ బయోపిక్ లో అడవి శేషు నటిస్తోన్న సంగతి తెలిసిందే. `మేజర్` టైటిల్ తో ఈ చిత్రాన్ని శశికిరణ్ తిక్క తెరకెక్కిస్తున్నారు. తెలుగు -హిందీ సహా పాన్ ఇండియా కేటగిరీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఉన్ని కృష్ణన్ పాత్ర కోసం శేషు ఆయన కుటుంబ సభ్యుల్ని కలిసి ఎన్నో వివరాలు తెలుసుకున్నారు.
ఆ రకంగా శేషు ఆ కుటుంబానికి బాగా దగ్గరయ్యాడు. షూటింగ్ సమయంలో ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రులు సైతం అప్పుడప్పుడు సెట్స్ కి వస్తూ వెళ్లేవారు. ఆ విధంగా ఆ ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉంది.
శోభిత ధూళిపాల..సాయి మంజ్రేకర్.. ప్రకాష్ రాజ్..రేవతి..మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు..హిందీ..మలయాళ భాషల్లో తెరకెక్కించారు. ఇతర భాషల్లోను ఇది అనువాద రూపంలో విడుదల కానుంది. ఇదే అడవి శేషు తొలి పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ - జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.