Begin typing your search above and press return to search.

బాప్‌ రే రెజీన.. 150కి.మీ సైకిల్‌ రైడ్‌

By:  Tupaki Desk   |   19 Aug 2015 6:38 AM GMT
బాప్‌ రే రెజీన.. 150కి.మీ సైకిల్‌ రైడ్‌
X
సమాజం, పరిసరాల విషయంలో సరైన అవగాహనతో ముందుకు సాగే స్టార్లు మనకి ఉండడం గొప్ప విషయం. అక్కినేని అమల బ్లూక్రాస్‌ సేవకురాలిగా మూగజీవాల్ని సంరక్షిస్తున్నారు. త్రిష కూడా పెటా తరపున మెంబర్‌. హన్సిక ప్రతియేటా పిల్లల్ని దత్తత తీసుకుని పోషణ, విద్యాబుద్ధులు నేర్పిస్తుంది. కాజల్‌ చదువుకోలేని ఆడపిల్లలకు చదువులు చెప్పిస్తోంది. ఇలా ప్రతి తారా తమ పరిధిలో మంచి పనులు చేస్తున్నారు. నవతరం నాయికల్లోనూ ఇలాంటి మంచి మనసు ఉన్నవాళ్లున్నారు.

ఇప్పుడున్న యువనాయికల్లో రెజీన సామాజిక సమస్యలకు స్పందించే మనసున్న తార. అందుకే కర్నూలు నుంచి హైదరాబాద్‌ వరకూ ఏకంగా 150 కి.మీ.లు సైకిల్‌ రైడ్‌ చేసింది ఈ భామ. 'పారా అథ్లెట్స్‌' (అంగవైకల్యం ఉన్న క్రీడాకారులు)కి బాసటగా నిలిచేందుకే ఈ పనిచేసింది. ఎంతసేపూ సానియామీర్జా, సైనా నెహ్వాల్‌, సింధు .. వీళ్ల పేర్లేనా వినిపించేది. పార అథ్లెట్స్‌ లోనూ ప్రతిభావంతులెందరో.. అలాంటి వారి గురించి ప్రపంచానికి తెలియాలి. అందుకే ఈ పనిచేశానని రెజీన చెప్పింది. కాళ్లు లేని ఓ అథ్లెట్‌ అందరిలాగే యథావిధిగా నడవాలి, పరిగెత్తాలి అంటే దాదాపు 22లక్షలు ఖర్చు చేయాలి. 2లక్షలు ఆర్టిఫిషియల్‌ కాలు సెట్‌ చేసినా, నడక శిక్షణకోసం 20లక్షలు ఖర్చు చేయాల్సొస్తోంది. జైపూర్‌ ఫుట్‌ తో అంత ఖర్చు లేకపోయినా అథ్లెటిక్స్‌ కి ఇది సూటబుల్‌ కాదు.. అని చెప్పింది. పారా ఒలింపిక్స్‌ కి ప్రిపరేషన్‌ లో ఉండే అథ్లెట్స్‌ గురించి, వారి కష్టాల గురించి అందరూ తెలుసుకోవాలి.. అని రెజీన ఆకాంక్షించింది.

150 కి.మీల రైడ్‌ చాలా కష్టమైనదే అయినా ఓ మంచి పనికోసం ఇలా చేయగలిగానని చెప్పింది. ఆదిత్య మెహతా అనే పారా సైక్లిస్ట్‌ ఈ రైడ్‌ కి నేతృత్వం వహించాడు. అతడు ఒంటికాలు తోనే బెంగళూరు నుంచి హైదరాబాద్‌ కి ఈ రైడ్‌ సాగించారు.