Begin typing your search above and press return to search.

రకుల్ ఫినిష్.. రెజీనాకి కావాలి

By:  Tupaki Desk   |   22 Dec 2015 10:30 PM GMT
రకుల్ ఫినిష్.. రెజీనాకి కావాలి
X
యాంగ్రీ హీరో కేరక్టర్ లతో ప్రేక్షకులను మైమరపించే గోపీచంద్.. కమర్షియల్ మూవీస్ కుమ్మేస్తున్నాడు. రెండక్షరాల పేర్లతో సినిమాలు, మూడక్షరా హీరోయిన్లు ఇతగాడికి బాగానే కలిసొచ్చారని చెప్పాలి. తన మోస్డ్ రీసెంట్ మూవీ లౌక్యంతో సూపర్ హిట్ కొట్టాడు గోపీచంద్. రొటీన్ మూవీ అనిపించుకున్నాసరే.. కామెడీతో కితకితలు పెట్టేసి సక్సెస్ సాధించేశాడు.

లౌక్యంతో రకుల్‌ ప్రీత్‌ కు బడా బ్రేక్‌ ఇచ్చాడు గోపీచంద్‌. ఆ మూవీ తర్వాత రకుల్ రేంజ్ మారిపోయింది. వరుసగా భారీ ఆఫర్స్ చుట్టుముట్టేశాయి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో బ్రూస్ లీ చేసింది. ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో దక్కించుకుంది. బన్నీ సరసన సరైనోడులోనూ నటిస్తోంది. ఇప్పుడు ఆమె స్నేహితురాలు రెజీనా కసాండ్రాతో కలిసి సౌఖ్యం చేశాడు ఈ హీరో. మరి రకుల్ కి ఇచ్చినట్లే.. రెజీనాకు కూడా మంచి హిట్ ఇచ్చి, ఆమె కెరీర్ ని టాప్ రేంజ్ కి తీసుకెళతాడా అనేది క్వశ్చన్ మార్క్.. ఈ విషయంలో రెజీనాకి మంచి క్లారిటీనే ఉన్నట్లుంది. అందుకే డ్యాన్సులు, పెర్ఫామెన్స్, గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా ట్యాలెంట్ చూపించింది.

తన కష్టానికి తగ్గ ఫలితం గోపీచంద్ ఇస్తాడని ఆశలు పెట్టుకుంది రెజీనా. నిజానికి సాయిధరం తేజ్ తో చేసిన సుబ్రమణ్యం ఫర్ సేల్ హిట్ కావడంతో.. రెజీనా మంచి జోష్ లోనే ఉంది. అయితే.. ఇంకా స్టార్ హోదా మాత్రం ఈభామకు దక్కలేదు. ఇప్పుడు ప్రయత్నమంతా అందుకోసమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి గోపీచంద్ రెజీనా కలలు నెరవేర్చుతాడో లేదో తెలియాలంటే.. మరో రెండు రోజులు ఆగాల్సిందే.