Begin typing your search above and press return to search.

స్టయిల్‌ స్టయిలురా ఏమి స్టయిలురా...

By:  Tupaki Desk   |   24 Aug 2015 3:49 PM GMT
స్టయిల్‌ స్టయిలురా ఏమి స్టయిలురా...
X
రెజీన లుక్‌ రోజు రోజుకి మారిపోతోంది. స్టయిలు స్టయిలురా ఏమి స్టయిలురా? అంటూ అప్పట్లో బాషా కోసం నగ్మా పాడుకుంది. కానీ ఇప్పుడు రెజీన కోసం కుర్రకారంతా పాడుకుంటున్నారు. రెజీన ఇటీవలి కాలంలో ఏ వేడుకలో కనిపించినా తనకంటూ ఓ యూనిక్‌ స్టయిల్‌ తో కనిపిస్తోంది. ఆచితూచి డిజైనర్‌ డ్రెస్‌ లను ఎంపిక చేసుకుని సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ అవుతోంది. ఇటీవలి కాలంలో సైమా వేడుకల్లో కుర్రకారు మతులు చెడగొట్టింది. మొన్నటి రోజున మెగా ఈవెంట్‌ లోనూ రెజీన కనిపించిన తీరు మైండ్‌ బ్లోవింగ్‌.

ఇదిగో ఇక్కడున్న పిక్‌ లో చూస్తుంటేనే ఆ స్టయిల్‌ వెనుక అసలు రహస్యం ఏంటో అర్థమవుతోంది. నాభి కేంద్రం, మెడ దిగువ భాగాల్ని మ్యాగ్జిమమ్‌ ఓపెన్‌ చేస్తూ డిజైన్‌ చేసిన డ్రెస్సుల్లే రెజీన ధరిస్తోంది. ప్రత్యేకించి ట్రెడిషన్‌ ని ఫాలో అవుతూ ఎంబ్రాయిడరీ వర్క్‌, కుందన్‌ వర్క్‌ వంటి డిజైన్లు ఉన్న స్పెషల్‌ డ్రెస్సులకు ప్రిఫరెన్స్‌ ఇస్తోంది. ఇక్కడున్న టాప్‌పై ఆ ఎంబ్రాయిడరీ ప్రత్యేక ఆకర్షణ.

ఇక బాటమ్‌ లైన్‌ లో పరికీణీ పై అందమైన పీకాక్స్‌ రెజీన మనస్తత్వానికి సింబాలిక్‌. టైమ్‌ ప్రకారం డైట్‌, ఎక్సర్‌ సైజులు, ఆరోగ్యం మెయింటెయిన్‌ చేస్తూ అనవసర కొలెస్టరాల్‌ ధరిచేరకుండా నాజూకు దేహశిరుల్ని అమ్మడు మెయింటెయిన్‌ చేస్తోంది. శరీరాకృతికి తగ్గ డ్రెస్సుల్ని ఎంపిక చేసుకుంటూ స్టయిలిష్‌ గా కనిపిస్తోంది. ఈ పిక్‌ చూస్తే ఆ సంగతి మీరే చెప్పొచ్చు.