Begin typing your search above and press return to search.
వావ్!! రెజీనా బాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్
By: Tupaki Desk | 18 Aug 2016 6:40 AM GMTసౌత్ నుండి బాలీవుడ్ వెళ్ళి అక్కడ పెద్ద హీరోయిన్ అయిపోవాలని చాలామంది స్టారీమణులు కలలుకంటూనే ఉన్నారు. కాని ఒక్కరు కూడా స్టార్ కాలేకపోయారు. అప్పట్లో త్రిష.. తరువాత తమన్నా.. మొన్ననే ఇలియానా.. ఇలా చాలామంది బాలీవుడ్ లో ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు డస్కీ బ్యూటి రెజీనా కసాండ్ర వంతు వచ్చిదండోయ్.
అయితే ఇతర హీరోయిన్ల తరహాలో ఇప్పుడు రెజీనా అవకాశాలు వెతుక్కుంటూ బాలీవుడ్ వెళ్ళలేదు. ఏకంగా టాలీవుడ్ లోనే ఈ భామ చేతిలో ఆరు సినిమాలున్నప్పుడు.. బాలీవుడ్ నుండి ఈమెకు కబురు వచ్చింది. అమితాబ్ బచ్చన్ - అనీల్ కపూర్ - అర్జున్ రాంపాల్ - అర్షద్ వార్సీ ప్రధాన పాత్రలుగా ఇప్పుడు ఆంఖేన్ సినిమాకు సీక్వెల్ ఆంఖేన్ 2 వస్తోంది. ఈ సినిమాలో ఇప్పటికే ఇలియానాను ఒక హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే కాస్త నెగెటివ్ షేడ్ ఉన్న మరో హీరోయిన్ పాత్ర కోసం రెజీనాను ఎప్రోచ్ అయ్యారట. అమ్మడు వెంటనే ఓకే చెప్పేసింది. జనవరి 2017 నుండి షూటింగ్ మొదలవ్వబోతోంది అని తెలుస్తోంది.
''వారే స్వయంగా నా పి.ఆర్.ఏజెన్సీ ద్వారా నన్ను ఎప్రోచ్ అయ్యారు. బాలీవుడ్ అనగానే ఎగిరి గంతేశా. కాకపోతే షూటింగ్ కు జనవరి వరకు టైమ్ ఉంది కాబట్టి.. ఈలోపు హిందీ బాగా నేర్చుకుంటున్నా. నా వాయిస్ డబ్బింగ్ నేను చెప్పుకుంటా'' అంటూ ఎక్సయిటింగ్ గా విషయం కన్ఫామ్ చేసింది రెజీనా. ఆల్ ది బెస్ట్ బ్యూటి!!