Begin typing your search above and press return to search.
పాపం రెజీనా.. అలా జరిగిందేంటో
By: Tupaki Desk | 18 April 2017 11:35 AM GMTసడన్ గా బాలీవుడ్ లో ఒక అవకాశం. కట్ చేస్తే ఒక రేంజులో లాంచ్ పార్టీ. వేసుకున్న డ్రస్సు కాస్త దారి తప్పడంతో వార్డ్రోబ్ మాల్ఫంక్షన్ అంటూ అదో న్యూస్ అయిపోయింది. ఇదంతా చేస్తే చివరకు డస్కీ బ్యూటి రెజీనా కసాండ్రా ఎక్కడితో పరిగెత్తేస్తుంది అనుకుంటే.. అక్కడ అంత సీన్ కనిపించట్లేదు.
తెలుగులో రిలీజవ్వాల్సిన ''నక్షత్రం'' సినిమాపై ఆశలు పెట్టుకున్న రెజీనా.. హిందీలో ''ఆంఖే 2'' సినిమాతో తన డెబ్యూ అదిరిపోనుందని ఫీలైంది. కాకపోతే జనవరిలో జరగాల్సిన ఈ సినిమా షూటింగ్ కోసం ఇంతవరకు రెజీనాను పిలువను కూడా పిలువలేదు. అయితే అనీస్ బజ్మీ డైరక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాలో రెజీనాను తప్పించి ఇంకెవరినైనా తీసుకున్నారా? లేకపోతే సినిమానే మొత్తంగా ఆపేశారా అనే విషయం మాత్రం తెలియదు. నిజానికి బడ్జెట్ ఎక్కువైపోతోందని ఈ సినిమా షూటింగ్ ఆపేసినట్లు తెలుస్తోంది. అసలు కనీసం సినిమా పట్టాలే ఎక్కలేదటలే.
పాపం రెజీనా.. ఒక కాజల్.. ఒక ఇలియానా.. ఒక త్రిష స్టయిల్లో బాలీవుడ్ లో ఏదన్నా ప్రూవ్ చేసుకోవాలని చాలా ఆశపడింది. కాని తొలిసినిమాయే పట్టాలెక్కకుండా ఆగిపోవడం కాస్త బాధాకరం. మరి కృష్ణవంశీ నక్షత్రంతో దశ తిరుగుతుందేమో చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/