Begin typing your search above and press return to search.
హోటల్ రూమ్ లోనే క్రిస్మస్ పండుగ
By: Tupaki Desk | 24 Dec 2015 7:30 AM GMTక్రిస్మస్ తాత బోసి నవ్వులు నవ్వుతూ కామెడీ స్కిట్ వేసే వేళ.. అప్పటికే రెడీ చేసిన కేక్ కట్ చేసి సందడి చేసే వేళ.. క్రిస్మస్ ట్రీ లైటింగులో స్నేహితురాళ్ల తో కలిసి జాలీగా గడిపేసే వేళ... ఆహా ఆ మధురానుభూతులు మర్చిపోలేనివి. బాల్యంలో స్కూలు ఫ్రెండ్సుతో - కౌమారంలో కాలేజ్ ఫ్రెండ్సుతో - డిగ్రీలో డోంగ్రీ ఫ్రెండ్సుతో కలిసి క్రిస్ మస్ సెలబ్రేషన్స్ చేసుకున్న వేళను, ఫ్రెండ్సుని ఇంటికి ఆహ్వానించి వారితో పాటే క్యాండిల్ లైట్ డిన్నర్లు చేసిన సందర్భాలు అస్సలు మర్చిపోలేనివి. అందుకేనేమో కెరీర్ కోసం పాకులాటలో హోటల్ రూమ్ లోనే గడిపేయాలంటే కాస్తంత ఇబ్బంది. కానీ తప్పదు పాపం. టాలీవుడ్ లో కెరీర్ స్వింగులో ఉంది. స్టార్ హీరోయిన్ గా స్టాటస్ దక్కింది. ఇంత ఇచ్చిన టాలీవుడ్ కోసం కొన్నిటిని వదులుకోవాల్సిందే. ఆ సంగతిని ఇట్టే గ్రహించిందేమో.. రెజీన కొన్ని సంగతుల్ని మనసు విప్పి మాట్లాడేసింది.
అవును ప్రతి సంవత్సరం చెన్నయ్ లో మా ఇంట్లోనే క్రిస్మస్ చేసుకునేదానిని. అమ్మ - నాన్న - క్రిస్మస్ తాత - ఫ్రెండ్సు అందరూ పక్కేనే ఉండేవారు. కానీ ఈ సంవత్సరం అస్సలు కుదరలేదు. తీరక లేని బిజీ షెడ్యూళ్లు. అందుకే హైదరాబాద్ లో నాకు కేటాయించిన హోటల్ రూమ్ నే క్రిస్మస్ రూమ్ లా మార్చేస్తున్నా. అమ్మ మాత్రమే నాతో ఉందిక్కడ. మమ్మీ బైటకు వెళ్లి డెకరేషన్ సమాన్లు కొని తెచ్చింది. నా రూమ్ని పూర్తిగా పండగ వాతావరణంలోకి తెచ్చేసింది. ఓ మూలగా క్రిస్మస్ ట్రీని కూడా పెట్టేశాం.. అంటూ చాలా సంగతులే చెప్పుకొచ్చింది. అన్నట్టు మరి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం ఎవరెవరిని అతిధులుగా ఆహ్వానిస్తుందో మాత్రం చెప్పనేలేదు. అందులో తనకి అత్యంత సన్నిహితుడు - హితుడు - ప్రేమికుడు ఉన్నాడో లేడో అసలే చెప్పలేదు. ప్చ్ .. రెజీనా చెప్పవా ప్లీజ్!!