Begin typing your search above and press return to search.
వీడియో టాక్: రెజీనా పెళ్ళికొడుకు కథ
By: Tupaki Desk | 30 Dec 2015 4:52 AM GMTటాలీవుడ్ లో వరుస ఆఫర్లతో కెరీర్ ని సాగిస్తోంది రెజీన. ఓ వైపు మెగా క్యాంపు హీరోలతో నటిస్తూనే ఇతరత్రా అవకాశాల్ని అందిపుచ్చుకుంటోంది. కెరీర్ ప్రారంభించిన తక్కువ టైమ్ లోనే 12 సినిమాల్లో నటించేసింది అమ్మడు. తెలుగు - తమిళ్ రెండుచోట్లా సినిమాలు చేస్తోంది. సేమ్ టైమ్ వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తూ దూసుకుపోతోంది. అప్పట్లో బన్నితో కలిసి ఓ.ఎల్.ఎక్స్ ప్రకటనలో నటించి ఆకట్టుకుంది.
ఇప్పుడు లేటెస్టుగా మరో ప్రెస్టేజియస్ యాడ్లో కనిపిస్తోంది. బిబా డిజైన్స్ కొత్త యాడ్ లో రెజీన ఎంతో బ్యూటిఫుల్ గా కనిపించింది. పెళ్లికూతురిని చూడడానికి వచ్చిన పిల్లాడు అతడి తల్లిదండ్రులతో అమ్మాయి ఇంట అడుగుపెట్టేస్తాడు. అయితే అప్పటికే పెళ్లికూతురు అలంకరణతో అందాల రెజీన బిజీ. ఇంతలోనే తండ్రి ఇంట్లో అడుగుపెట్టి త్వరగా రామ్మా! అనేస్తాడు. టీకప్పుతో పెళ్లికొడుకు తరపు వారిని సంతుష్టుల్ని చేశాక ఆ పెళ్లి చూపుల సన్నివేశంలో ముచ్చట్లు భలే గమ్మత్తుగానే ఉన్నాయ్. మొత్తానికి పిల్ల పెళ్లి కొడుక్కి నచ్చింది. బోలెడంత ఫన్ ఉన్న కమర్షియల్ వీడియో ఇది.
అయితే వీడియో ఆద్యంతం రెజీన షో నడిచింది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టేసింది. ముఖ్యంగా ఆ రెడ్ కలర్ ట్రెడిషనల్ డ్రెస్ లో రెజీన అదిరిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఆ రెడ్ కలర్ డ్రెస్ బైబో కంపెనీది అన్నమాట! దానికోసం ఇంత డ్యూరేషన్ వీడియో. అచ్చం సినిమాలో సన్నివేశంలో డిజైన్ చేశారు. అన్నట్టు పెళ్లి చూపులు ప్రకటన వరకేనా? రియాలిటీలోనూ పెళ్లికొడుకును వెతుక్కుంటోందా? లేదా? రెజీనానే స్వయంగా చెప్పాలి మరి.