Begin typing your search above and press return to search.

సినిమాకంటే రిబ్బన్ కటింగే ముఖ్యమా?

By:  Tupaki Desk   |   4 Aug 2017 6:21 PM GMT
సినిమాకంటే రిబ్బన్ కటింగే ముఖ్యమా?
X
ఇక్కడేమో సినిమా రిలీజ్ అవుతోంది. ఒకవేళ నిజంగా ఖాళీగా ఉంటే మాత్రం.. చక్కగా వచ్చి సినిమాను ప్రమోట్ చేస్తే.. హ్యాపీగా కలక్షన్లు బాగుంటాయి. కనీసం ఈ ప్రమోషన్ల కారణంగా ఓపెనింగులైనా వస్తాయి. కాని ఒక స్టారీమణి మాత్రం.. తన సినిమా రిలీజుకంటే రిబ్బన్ కటింగ్ యాపారమే ముఖ్యం అనుకున్నట్లుంది. అందుకే అమ్మడు హైదరాబాద్ రాకుండా కొయంబత్తూరు చెక్కేసింది.

ఈరోజు విడుదలైన ''నక్షత్రం'' సినిమాలో డస్కీ బ్యూటి రెజీనా అందచందాలను ఆరబోస్తూ ఒక ఛమక్కుమనే రోల్ చేసిందిలే. ఈమె ఉన్న రెండు పాటల్లోనూ గ్లామర్ కు కొదవే లేదు. అలాంటప్పుడు అమ్మడు ఈ సినిమాను ప్రమోట్ కూడా చేయాలి కదా? మరి హైదరాబాద్ రావడానికి రెజీనాకు ఏం ప్రాబ్లమో తెలియదు కాని.. ఇక్కడ సినిమాను ప్రమోట్ చేయాల్సిన రెజీనా.. ఒక బట్టల షాపు ఓపెనింగ్ చేయడానికి కొయంబత్తూరు వెళ్ళింది. అక్కడ కత్తిరించినందుకు మళ్ళీ పైకం కూడా ఇస్తారులే... అందుకే అటు మొగ్గుచూపిందా? అయినాసరే అంతేసి డబ్బులు పెట్టి సినిమాను తీసిన నిర్మాతకు అసలు షూటింగ్ అయ్యాక సపోర్టు చేయకపోతే ఎలా బేబి?

సన్నిహితుల మాట ఏంటంటే.. ఈ సినిమాలో చేసినందుకు రెజీనాకు బయట ఎంత పేమెంట్ ఇస్తారో అందులో కేవలం పావు వంతు ఇచ్చారట. అంత తక్కువ పేమెంట్ తీసుకుని.. ఏదో భారీ కోట్లలో పేమెంట్ ఇచ్చినట్లు గ్లామర్ దారబోయించి.. ఇప్పుడు ప్రమోషన్లకు రమ్మంటే ఎలా అంటూ రెజీనాకు కోపం వచ్చిందట. మరి వెండితెరపై ఈమె గ్లామర్ ను చూసినోళ్లు.. నిజమేలే.. రెజీనాకు కోపం రావడం సహజం అంటున్నారు.