Begin typing your search above and press return to search.

రెజీనా చించేసుకుంటే పనవ్వుద్దా?

By:  Tupaki Desk   |   30 July 2017 3:34 PM GMT
రెజీనా చించేసుకుంటే పనవ్వుద్దా?
X
సడన్ వచ్చిన ఒక అనౌన్స్్మెంట్. ఈ శుక్రవారం.. ఆగస్టు 4న.. ''నక్షత్రం'' ''దర్శకుడు'' సినిమాలు విడుదలవుతున్నాయి. వీటిల్లో ఇప్పటికే నక్షత్రం సినిమా గురించి చాలా డేట్లు ఇచ్చేసి డ్రాప్ అయ్యారు. కాబట్టి రిలీజ్ రోజు వచ్చేవరకు అసలు ఈ సినిమా వస్తుందా రాదా అనేది నమ్మశక్యం కాని విషయమే. అయితే దర్శకుడు కృష్ణవంశీ మాత్రం ఈ సినిమాను ప్రమోట్ చేసే పద్దతి మార్చట్లేదు.

మొదటి నుండీ కూడా ఈ సినిమా ట్రైలర్లో కనిపించిన అతి ఎవ్వరికీ కిక్ ఇవ్వలేదు. అసలు ప్రతీ క్యారక్టర్ అలా చించేసుకుని అరవడం ఎందుకు బాబు అంటూ అందరూ చెవులు కొరుక్కున్నారు. కట్ చేస్తే.. కృష్ణవంశీ మాత్రం రెజీనా కసాండ్రా గ్లామర్ తో ప్రమోషన్ చేయడం మొదలెట్టారు. ఏనుగుల మీద ఎక్కిన రెజీనా.. జనాల మధ్యలో డ్యాన్స్ వేస్తున్న రెజీనా.. సెక్సీ కాస్ట్యూమ్స్ లో రెజీనా.. ఇలా రచ్చంతా ఆమెదే. ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేసిన పోస్టర్లలో కూడా రెజీనా గ్లామరే సెంటర్ ఆఫ్‌ ఎట్రాక్షన్. కాని కేవలం ఇలా రెజీనా తన గ్లామర్ తో చించుకుంటే సినిమాకు రావల్సినంత క్రేజ్ వస్తుందా?

ఈ సినిమా కోసం సాయిధరమ్ తేజ్.. సందీప్ కిషన్.. తనీష్‌.. ఇంటర్యూలు ఇవ్వొచ్చు. కృష్ణవంశీ కూడా సినిమా గురించి మీడియా ముందుకొచ్చి చాలా చెప్పొచ్చు. రెజీనా అండ్ ప్రగ్యా జైస్వాల్ కలసి జాయింట్ ఎప్పియరెన్స్ ఇవ్వొచ్చు. ఇవన్నీ వదిలేసి కేవలం రెజీనా పోస్టర్లతో పనవ్వుద్ది అనుకుంటే మాత్రం అది బ్యాడ్ ప్లానింగే అవుతుంది.