Begin typing your search above and press return to search.

సొగసుల సుందరికి ఎంత మంచి మనసో!

By:  Tupaki Desk   |   6 Nov 2016 6:50 AM GMT
సొగసుల సుందరికి ఎంత మంచి మనసో!
X
టాలీవుడ్ బ్యూటీ అయినా కోలీవుడ్ లో సత్తా చాటేందుకు కష్టపడుతోంది రెజీనా కసాండ్రా. గ్లామర్ రోల్స్ విషయంలో నిర్ణయం తీసుకోవడం కాస్త ఆలస్యమవడంతో రేసులో వెనకబడింది కానీ.. లేకపోతే స్టార్ హీరోయిన్ రేస్ లో ప్రముఖంగా వినిపించిన పేరు ఈమెది. యాక్టింగ్ విషయంలో ట్యాలెంటెడ్ కావడంతో.. మెల్లగా అయినా పికప్ అయేందుకు అన్ని అకవకాశాలు ఉన్న రెజీనాకి.. మేని సొగసులే కాదు మంచి మనసు కూడా ఉంది.

హీరోయిన్లు ఛారిటీ కార్యక్రమాల్లో సాధారణమే కానీ.. మూడు ఛారిటీ ఆర్గనైజేషన్లకు అండగా నిలబడ్డం.. తోడు నడవడం అంటే మాత్రం చిన్న విషయం కాదు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సేవా కార్యక్రమాల వివరాలను రెజీనా వివరించింది. 'లైఫ్ ఈజ్ ఏ బాల్' అనే ఆర్గనైజేషన్ ను ఈ బ్యూటీ బెస్ట్ ఫ్రెండ్స్ నిర్వహిస్తూ ఉంటారు. హైద్రాబాద్ చెన్నై నగరాల్లో సేవలు అందించే ఈ సంస్థ. చిన్నారుల్లో అథ్లెటిక్ స్కిల్స్ పెంపొందించేందుకు కృషి చేస్తూ ఉంటుంది. పిల్లలకు వారిలోని ఆటల సామర్ధ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు అవసరమైన పరికరాలను అందిస్తూ ఉంటుంది ఈ సంస్థ.

ఇక ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు ఇంగ్లీష్ లో నైపుణ్యం పెంపొందించే క్లాసులు నిర్వహించే 'లైఫ్ ఫర్ ఏ చేంజ్' అనే సంస్థకు కూడా సాయం చేస్తూ ఉంటుంది. రెజీనా సాయం అందించే మరో సంస్థ అదిత్యా మెహతా ఫౌండేషన్. అదిత్యా మెహతా అనే ఫిజికల్లీ ఛాలెంజెడ్ పర్సన్.. తనలాంటి వాళ్లకి సాయం అందించేందుకు ఏర్పాటు చేసిన సంస్థే ఇది. ఇలా మూడు స్వచ్ఛంద సంస్థలతో వర్క్ చేస్తూ.. రెజీనా తన మన మంచి మనసును చాటుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/