Begin typing your search above and press return to search.

రెజీనాకి గ్లామర్ కూడా అచ్చిరాలేదుగా

By:  Tupaki Desk   |   24 Dec 2015 5:30 PM GMT
రెజీనాకి గ్లామర్ కూడా అచ్చిరాలేదుగా
X
రెజీనా కసాండ్రా.. పెర్ఫామెన్స్ పరంగా వంక పెట్టక్కర్లేదు అనిపించే నయా జనరేషన్ హీరోయిన్. రేపటి తరానికి కాబోయే స్టార్ అని కూడా అంచనాలున్నా.. కాలం మాత్రం కలిసి రావడం లేదు. తమిళంలో ఓ పదేళ్ల క్రితమే ఇంట్రీ ఇచ్చింది. అక్కడ అవకాశాలు అంతగా దక్కించుకోలేక.. టాలీవుడ్ లో అడుగు పెట్టింది రెజీనా.

ఇక్కడ తను చేసిన సినిమాలు అన్నింటిలోనూ పెర్ఫామెన్స్ సూపర్బ్ అనిపించుకుంది. రెజీనా యాక్టింగ్ కోసం చూడచ్చు అనిపించే మూవీస్ కూడా కొన్ని ఉన్నాయంటే.. అమ్మడి ట్యాలెంట్ అర్ధమవుతుంది. కానీ.. టాలీవుడ్ లోనూ నాలుగేళ్లుగా సూపర్ హిట్ కోసం పోరాడుతూనే ఉంది. ఈ నాలుగేళ్లలో ఈమె నటించిన సినిమాలు ఎనిమిది రిలీజ్ అయ్యాయి. అయితే.. ఇప్పటివరకూ ఓ లెక్క.. ఈ ఏడాది మాత్రం ఒక లెక్క అనుకోవాలి. ఎందుకంటే.. ఇప్పుడు రెజీనా గ్లామర్ రోల్స్ వైపు మళ్లింది.

సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రంతో రెండో మెగా హీరోతో జట్టు కట్టినా కెరీర్ కి బూస్ట్ మాత్రం రాలేదు. పెర్ఫామెన్స్ పాత్రలు హిట్స్ అందించలేకపోవడంతో.. ఇప్పుడు సౌఖ్యంలో తనకు ప్రాధాన్యంలేని హీరోయిన్ రోల్ చేసింది. పాటల్లో డ్యాన్సులు వేసుకుంటూ.. హీరో పక్కన తిరుగుతూ ఉండే పాత్ర.. రెజీనా కెరీర్ కి ఏ మాత్రం ఉపయోగపడలేక పోయింది. ఇటు పెర్ఫామెన్స్, అటు గ్లామర్.. రెండూ సెట్ కాకపోవడంతో ఎలాంటి రోల్స్ చేయాలా అని మథనపడుతోంది ఈ చెన్నై సుందరి.

ప్రస్తుతం ఈమె నటిస్తున్న టాలీవుడ్ సినిమాలు 3 సెట్స్ పై ఉన్నాయి. నారా రోహిత్ తో శంకర, మంచు మనోజ్ తో శౌర్య - రాణాతో ఒక మూవీ చేస్తోంది. ఈ మూడు వచ్చే ఏడాది రిలీజ్ అయ్యి.. రెజీనా ఫేట్ ని, ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయని చెప్పచ్చు.