Begin typing your search above and press return to search.

చిరు152 లో రెజినా.. అది సంగతి!

By:  Tupaki Desk   |   31 Dec 2019 10:27 AM IST
చిరు152 లో రెజినా.. అది సంగతి!
X
మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్లో #చిరు152 కొద్దిరోజుల క్రితం లాంచ్ అయింది. ఈమధ్యే మెగాస్టార్ లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిషను హీరోయిన్ గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఒక స్పెషల్ సాంగ్ కోసం బ్యూటిఫుల్ రెజినాను ఎంచుకున్నారని.. రెజినా మెగాస్టార్ తో స్టెప్పులేయడం ఖాయమని కూడా ఈ మధ్య వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇందులో సగమే నిజమని సమాచారం.

ఈ సినిమా లో ప్రత్యేక గీతం కోసం కొరటాల టీమ్ రెజినా కసాండ్రా ను సంప్రదించిన మాట వాస్తవమేనట. అయితే రెజినా ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందని టాక్ వినిపిస్తోంది. విభిన్నమైన పాత్రలు లేదా నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలు చేసేందుకు రెజినా సిద్ధమట కానీ ఐటమ్స్ సాంగ్స్ లో ఆడిపాడేందుకు తను ఆసక్తి చూపించడం లేదట. అందుకే ఇది క్రేజీ ఆఫర్ అయినప్పటికీ 'నో' చెప్పిందని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమే అయితే రెజినా చాలా బోల్డ్ డెసిషన్ తీసుకుందనే చెప్పాలి. కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించే చిత్రం ఒక క్రేజీ ప్రాజెక్టు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి వ్యక్తం అవుతోంది. మిగతా హీరోల సినిమాలో స్పెషల్ సాంగ్స్ ఎలా ఉంటాయో ఏమో కానీ మెగాస్టార్ సినిమాలో ఐటెం సాంగ్ హిట్ అయితే ఆ హీరోయిన్ కు భారీ గుర్తింపు దక్కుతుంది. ఇలాంటి ఆఫర్ ను రెజినా తిరస్కరించడం ఆశ్చర్యమే.

రెజినాకు ఇప్పుడు తెలుగులో పెద్దగా ఆఫర్లు లేవు కానీ తమిళం లో మాత్రం ఫుల్లుగా సినిమాలు ఉన్నాయి. రెజినా ప్రస్తుతం 'కల్లాపార్ట్'. 'కసడతపర'.. 'చక్ర' అనే సినిమాల్లో నటిస్తోంది. ఇవి కాకుండా ఈమధ్య హిందీలో కూడా ఒక సినిమా సైన్ చేసిందనే టాక్ ఉంది.