Begin typing your search above and press return to search.
ఇంటర్యూ: కొరికేసి చలిలో ఏడ్చేశా!!
By: Tupaki Desk | 21 Sep 2015 7:30 AM GMTచెన్నయ్ బ్యూటీ రెజీనా నటించిన తాజా చిత్రం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. సాయిధరమ్ తేజ్ హీరో. హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించారు. ఈనెల 24న సినిమా రిలీజవుతోంది. ఈ సందర్భంగా కథానాయిక రెజీన చెప్పిన సంగతులివి....
సాయిధరమ్ తో రెండోసారి:
సాయిధరమ్ సరసన నటించిన పిల్లా నువ్వులేని జీవితం సినిమా నా కెరీర్ కు చక్కని ఎనర్జీనిచ్చింది. ఆ సినిమా తర్వాత వస్తోన్న ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ అంతకు రెట్టింపు విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. హరీష్ శంకర్ శైలిలోని కమర్షియల్ చిత్రమిది. ఫ్యామిలీ సెంటిమెంట్ - రొమాన్స్ - యాక్షన్ ఇలా అన్ని కోణాల్లోనూ ఆకట్టుకుంటుంది.
సీత దబాయిస్తుంది తెలుసా?
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రంలో సీత అనే క్యారెక్టర్ చేస్తున్నా సీత ఒక సాధారణ అమ్మాయి. సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన ఓ అమాయకురాలైన అమ్మాయి. సీత ఇక్కడ.. సీతతో అంత ఈజీ కాదు.. అంటూ దబాయించే పాత్ర అది. అమాయకత్వాన్ని కవర్ చేసుకోవడానికే అలా చెబుతుంది. తనకి సుబ్రహ్మణ్యం పరిచయం అవుతాడు. అతడిది సాయం చేసే మనసు. అయితే దానికి డబ్బు ఇవ్వాలి. అలా సీతకు సాయం చేసిన సుబ్బు ఓ సమస్య నుంచి ఎలా బైటపడేశాడు ? అన్నది తెరపైనే చూడాలి. సీత పాత్రతో గాళ్స్ తమను తాము ఐడెంటిఫై చేసుకునేలా ఉంటుంది.
పాత్రకు తగ్గట్టే గ్లామర్ ఒలకబోస్తా..
దర్శకుడు ఒక పాత్రను డిజైన్ చేసిన విధానం బట్టి గ్లామర్ ఒలకబోయాలి. అది ఏంటో ఆరంభంలో అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడర్థమవుతోంది. గ్లామర్ అంటే స్కిన్ షో కాదని నా అభిప్రాయం. పాత్రకు తగ్గట్టుగా గ్లామరస్ గా కనిపించడం వేరని అర్థం చేసుకోవాలి. హరీష్ డిజైన్ చేసిన పాత్రకు తగ్గట్టుగా గ్లామరస్ గానే కనిపిస్తున్నా.
రిహార్సల్స్ ముందే చేస్తాం..
తేజ్ మంచి ఫ్రెండ్. తనతో కలిసి నటించడం సరదాగా ఉంటుంది. మేం ఆన్ సెట్స్ అన్నీ మనసువిప్పి మాట్లాడుకుంటాం. ఒక సీన్ కోసం రెడీ అవ్వాలన్నప్పుడు ఆ సీన్ గురించి మాట్లాడుకొని ముందే రిహార్సల్స్ చేస్తుంటాం. పిల్లా నువ్వులేని జీవితం సినిమాలోకంటే ఈ సినిమాలోనే మా ఇద్దరి కాంబినేషన్ లో సీన్స్ హైలైట్ గా ఉంటాయి.
హరీష్ క్లారిటీ ఉన్న దర్శకుడు!!
హరీష్ శంకర్ ఏదైనా అనుకుంటే అది చేసి తీరతారు. సినిమాకు ఏమేం కావాలన్న విషయంలో ఆయనకు పూర్తి క్లారిటీ ఉంది. అందరికీ సౌకర్యంగా ఉంటూనే కావాల్సిన ఔట్ పుట్ తీసుకుంటాడు. చాలా జాగ్రత్తపరుడు.
ఒక షాట్ లో 34 టేకులు తీసుకున్నా
అమెరికాలో షూటింగ్ గొప్ప అనుభవాన్నిచ్చింది. అది బెస్ట్ టైమ్ అనే చెబుతా. సినిమా యూనిట్ లోని ప్రతి ఒక్కరూ ఒకే బస్ లో ప్రయాణించడం దగ్గర్నుంచీ, అంతా సరదా సరదాగా గడిచిపోయింది. ఇక ‘సీత ఇక్కడ’ అంటూ ఓ ఎమోషనల్ సీన్ చేసే టైమ్ కి, ఆ ప్రాంతంలో విపరీతమైన చలి ఉంది. నేనేమో ఏడుస్తూ సీన్ చేయాలి. ఈ సీన్ కోసం దాదాపుగా 34 టేక్స్ తీసుకున్నా. ఈ ఒక్క సీన్ కోసం చాలా శ్రమించాను. సీన్ పూర్తవ్వగానే ఆ కొరికేసే చలిలో ఏడ్చేశాను.
మెగా సాంగ్ కి డ్యాన్స్ చేయడం అదృష్టం
గువ్వా గోరింకతో .. మెగా సాంగ్ ను ఈ సినిమాకు రీమిక్స్ చేశారు. దీనికి నేను డ్యాన్స్ చేయడం.. నా అదృష్టం. ఇప్పటివరకూ కెరీర్ బెస్ట్ డ్యాన్సులు ఈ సినిమాలోనే చేశాను. ఇలాంటిది నాకు ఓ ప్రత్యేక అనుభవం అనిపిస్తోంది.
ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్
అందరూ మెచ్చే కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. లవ్ - యాక్షన్ - ఫ్యామిలీ ఇలా అన్ని రసాలు సినిమాలో ఉన్నాయి. మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్ ప్రధాన బలం.
నాకంటూ గుర్తింపు వచ్చింది
ఇంతకాలంగా నటిస్తుంటే ఇప్పటికి ఓ గుర్తింపు వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నా ఇప్పుడు. ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఇక సందీప్ కిషన్ తో తమిళ సినిమా ఈ డిసెంబర్ లో విడుదలవుతుంది. తెలుగు, తమిళ్ లో ప్యారలల్ గా కెరీర్ ని సాగిస్తాను. సంతోషంగా ఉన్న క్షణమిది.