Begin typing your search above and press return to search.

రెజీనాలో ఈ యాంగిల్ కూడా ఉందా?

By:  Tupaki Desk   |   2 July 2016 5:10 AM GMT
రెజీనాలో ఈ యాంగిల్ కూడా ఉందా?
X
అందాల ముద్దుగుమ్మ రెజీనాలో ఏషాలకు తక్కువేం లేదు. క్యూట్ గా కనిపిస్తూ.. ఒద్దికగా ఉండే అమ్మాయిలా కనిపించే ఈ భామలో చాలామందికి కనిపించని యాంగిల్ గురించి రెజీనానే స్వయంగా చెప్పుకొచ్చారు. కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత టాలీవుడ్ కి వచ్చిన ఈ భామ గతంలోకి వెళ్లి.. తన చిన్నతనంలో గడుసుతనం ఎక్కువేనని చెప్పుకొచ్చిన ఆమె.. తాను వేసి అల్లరి ఏషాల్ని వివరించింది.

లాస్ట్ ఇయర్ బెంగళూరులో అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో ఫ్రెండ్స్ తో కలిసి వెళుతున్నప్పుడు లస్సీ తాగాలనిపించిందని.. అప్పుడే మూస్తున్న ఒక షాపు దగ్గరకు వెళ్లి లస్సీ అడిగితే.. కుదరదని షాపు యజమాని చెప్పాడని.. ఆ టైంలో తాను గర్భవతినని చెప్పి.. లస్సీ ఇస్తే మిమ్మల్ని ఆ భగవంతుడు ఆశీర్వదిస్తాడని చెప్పి లస్సీ తాగేసినట్లు చెప్పుకొచ్చారు. తాను చెప్పిన సమాదానంతో తన ఫ్రెండ్స్ షాక్ తిన్నారని.. తాను చెప్పిన ‘కడుపు’ విషయాన్ని షాప్ అతను అందరికి చెబుతారని భయపడినా.. లక్కీగా అతను మాత్రం ఎవరికి చెప్పలేదంటూ తన అల్లరి గురించి చెప్పుకొచ్చింది. ఇలాంటి తమాషాలు తాను చాలానే చేస్తానని చెబుతున్న రెజీనాలో ఇంత అల్లరి అమ్మాయి ఉందా..?