Begin typing your search above and press return to search.
డిసెంబర్లో షాకివ్వబోతున్న రెజీనా
By: Tupaki Desk | 13 Nov 2017 12:30 PM GMTడస్కీ బ్యూటీ రెజీనా త్వరలోనే ‘బాలకృష్ణుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. గతంతో పోలిస్తే మధ్యలో తెలుగులో తన జోరు కొంచెం తగ్గినప్పటికీ.. తాను ఇప్పుడు మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని చెప్పింది రెజీనా. తన కెరీర్లో అత్యంత ప్రత్యేకమైన పాత్రలు ఇప్పుడు చేస్తున్నానని.. అందులో భాగంగా చేసిన ఓ సినిమా అందరికీ షాకిస్తుందని రెజీనా చెప్పింది. ఈ సినిమా గురించి.. ఇందులో తన పాత్ర గురించి ఇప్పుడేమీ చెప్పనని.. డిసెంబర్లో ఈ సినిమాలో తన లుక్ బయటికి వస్తుందని.. అప్పుడు అందరూ షాకవడం ఖాయమని ఆమె చెప్పింది. ఈ సినిమా కోసం తాను ఎన్నడూ ట్రై చేయని మేకప్ ప్రయత్నించినట్లు రెజీనా తెలిపింది.
ఇక రానా సరసన చేస్తున్న ‘1945’ సినిమాలో కూడా తన పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని.. ఆ సినిమాలో పూర్తిగా చీరకట్టులో కనిపిస్తానని రెజీనా చెప్పింది. బాలీవుడ్లో తనకు అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోవడం గురించి రెజీనా స్పందించింది. ‘‘ఆంఖే-2 సినిమాలో అవకాశం వచ్చినందుకు చాలా సంతోషించా. కానీ నేను ఆ సినిమా చేయడం లేదు. దాని కరెంట్ స్టేటస్ ఏంటన్నది కూడా తెలియదు. ఆగిందని అంటున్నారు. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఆ సినిమాలో అవకాశం కోల్పోవడం గురించి పెద్దగా చింతించట్లేదు. నిజానికి 2015లో నేను కోరుకున్నట్లుగా నా కెరీర్ సాగట్లేదని.. మంచి అవకాశాలు రావట్లేదని చాలా ఫీలయ్యాను. డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. కానీ తర్వాత నా ఆలోచన మారిపోయింది. నేను బాధలో ఉన్నపుడు ‘జ్యో అచ్యుతానంద’ లాంటి మంచి సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా నాకు మంచి అనుభూతిని కలిగించింది’’ అని రెజీనా తెలిపింది.