Begin typing your search above and press return to search.

తను కూడా నాకు మంచి ఫ్రెండ్ -రెజీనా

By:  Tupaki Desk   |   23 Jan 2016 5:30 PM GMT
తను కూడా నాకు మంచి ఫ్రెండ్ -రెజీనా
X
సినీ ఇండస్ట్రీలో ఫ్రెండ్ షిప్ లు బాగానే పెరుగుతున్నాయి. ఒకప్పుడు బయట ఎక్కడైనా ఇద్దరు హీరోలో, ఇద్దరు హీరోయిన్లో కలిసి కనిపించడానికి కూడా ఆలోచించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. గ్రూపులు - బ్యాచ్ లు - గ్యాంగులుగా ఏర్పడిపోయి పార్టీలు కూడా చేసేసుకుంటున్నారు. ముఖ్యంగా కుర్ర తరమైతే కుమ్మేస్తున్నారని చెప్పాలి.

అయితే కుర్ర హీరోయిన్ రెజీనా కసాండ్రా గురించి మాత్రం టాలీవుడ్ లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. మెగా హీరో సాయిధరం తేజ్ తో ఈ భామ డేటింగ్ చేసేస్తోందని అంటున్నారు. మరి ఇలాంటి రూమర్స్ గురించి స్పందిచమంటే.. సాధారణంగా అయితే సైడైపోతారు సుందరాగులు. కానీ రెజీనా మాత్రం ఫ్రెండ్స్ గురించి అడిగితే గడగడా చెప్పేసింది. 'నేను తన బెస్ట్ ఫ్రెండ్ అని రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే చెప్పింది. సో రకుల్ నాకు కూడా బెస్ట్ ఫ్రెండ్. ఆమె కాకుండా.. సాయి ధరం తేజ్ - శిరీష్ లతో కూడా మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. వీరికి తోడు సందీప్ కిషన్ కూడా నా ఫ్రెండే' అని చెప్పింది రెజీనా. ఇంత మంది పేర్లు చెప్పిందని కన్ ఫ్యూజ్ కానక్కర్లేదు.

అందరి లాగే తేజు కూడా నాకు ఫ్రెండ్ మాత్రమే అని చెప్పడమే ఈమె అసలు ఉద్దేశ్యం. రూమర్స్ గురించి ఎక్కడ అడుగుతారో అని.. తనే ముందుగా తేజు పేరు ప్రస్తావించి.. ఇంకో ఇద్దరి ముగ్గురితో కలిపి చెప్పేసిందన్న మాట. ఆన్సర్ చాలా ఇంటెలిజెంట్ గానే చెప్పింది కానీ.. అసలు విషయం దాస్తోందంటారా లేక.. అసలు నిజం ఇదేనంటారా? ఏమో.. సినిమా ఇండస్ట్రీలో ఏ ఫ్రెండ్ షిప్ ఎక్కడి వరకూ వెళ్తుందో చెప్పడం చాలా కష్టమబ్బా!