Begin typing your search above and press return to search.
రెజీనా మనస్సులో ఉన్న ఆ ఐదుగురు
By: Tupaki Desk | 16 Sep 2016 7:30 AM GMTఈ తరం హీరోయిన్స్ కు ఎక్కడ ఎలా మాట్లాడాలో.. ఏం మాట్లాడకూడదో అనే విషయంలో పక్కా క్లారిటీ ఉంటోంది. మాట్లాడ్డం.. చొచ్చుకుపోయి సినిమా ఆఫర్స్ దక్కించుకోవడంలో ఇన్నేళ్లు వెనకబడ్డ రెజీనా.. ఇప్పుడు స్టైల్ మార్చినట్లు కనిపిస్తోంది.
రీసెంట్ గా ఓ టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన రెజీనా.. తనకు నచ్చిన హీరోలు- ఎవరితో సినిమా చేయాలని అనుకుంటోందనే ప్రశ్నకు.. భలే ఇంటెలిజెంట్ ఆన్సర్ ఇచ్చింది. స్టార్ హీరోల్లో ఒకరి పేరు చెప్పి.. మరొకరి మానేస్తే.. అదో పెద్ద చిక్కు. అందుకే ఒకరి పేరు చెప్పడం కష్టమంటూ.. ఓ ఐదు పేర్లు చదివేసింది. ఇందులో తెలుగు స్టార్ హీరోలు ముగ్గురుంటే.. కోలీవుడ్ స్టార్స్ ఇద్దరున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లంటే తనకు చాలా ఇష్టమని చెప్పేసింది రెజీనా.
ఇక తమిళ్ లో అయితే.. విక్రమ్. సూర్యల యాక్టింగ్ అంటే మాత్రం విపరీతంగా నచ్చేస్తుందని రెజీనా చెబుతోంది. అమ్మడు చెప్పిన పేర్లను ఓసారి పరిశీలిస్తే.. రెజీనా టార్గెట్ వీళ్లందరితో సినిమాలు చేసేస్తా చాలని అనిపించడం లేదూ! ఇప్పుడు అమ్మడి కెరీర్ సాగుతున్న తీరు చూస్తే.. ఇది కష్టమే అనిపించచ్చు. కానీ ఇప్పుడు చేస్తున్న నక్షత్రం క్లిక్ అయితే మాత్రం.. రెజీనా రేంజ్ పెరిగిపోవడం ఖాయమే.