Begin typing your search above and press return to search.

తాను చేసింది చెత్త సినిమా అంటున్న రెజీనా

By:  Tupaki Desk   |   10 Jan 2016 1:30 PM GMT
తాను చేసింది చెత్త సినిమా అంటున్న రెజీనా
X
సౌత్ ఇండియాలో మాంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో అమలాపాల్ ఒకరు. కానీ ఆ పేరు రావడానికి ముందు హీరోయిన్ గా అమల చేసిన తొలి సినిమా ఎప్పటికీ ఆమెకు పెద్ద మచ్చే. ఓ కుర్రాణ్ని పెళ్లి చేసుకుని.. అతడి తండ్రితో సంబంధం పెట్టుకునే అమ్మాయి పాత్రలో ఆమె నటించిన ‘సింధు సమవేలి’ తమిళనాట పెను దుమారానికి దారితీసింది. ఈ సినిమా తర్వాత అమల మంచి పాత్రలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగినప్పటికీ.. తన తొలి సినిమాను తలుచుకుంటే మాత్రం ఆమెకు ఇబ్బందిగానే ఉంటుంది. ఇలాంటి ఇబ్బందే రెజీనాకు కూడా ఉంది. కెరీర్ ఆరంభంలో తాను చేసిన ఓ సినిమా గురించి రెజీనా కూడా ఇలాగే బాధపడుతోంది. టెన్త్ క్లాస్ చదువుతుండగా ‘కండ నాల్ ముదల్’ అనే ఓ సినిమాలో నటించింది రెజీనా. ఆ సినిమా ఓ మోస్తరుగా పేరు తెచ్చింది.

ఐతే దాని తర్వాత ‘అళగియ అసుర’ అనే బి-గ్రేడ్ టైపు సినిమా చేసింది రెజీనా. అందులో హీరోతో ముద్దు సన్నివేశాలు చేయడమే కాదు.. హాట్ హాట్ సన్నివేశాల్లో నటించింది. ఓ ఇంటర్వ్యూలో ఆ సినిమా పేరెత్తకుండా అందులో నటించడం తాను చేసిన పెద్ద తప్పని చెప్పింది రెజీనా. ‘‘నేను 11వ తరగతిలో ఉన్నపుడు హీరోయిన్ గా అవకాశం వచ్చింది. నేను నా జీవితంలో చేసిన చెత్త సినిమా అదే అని చెప్పాలి. అందులో నటించాక ఇకపై ఎలాంటి సినిమాలు చేయాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిసొచ్చింది. నేను మెచ్యూరిటీ లేకుండా ఎంచుకున్న సినిమా అది. ఇంకెప్పుడూ అలాంటి సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నా’’ అని చెప్పింది రెజీనా. కానీ రెజీనా ఇప్పుడు కూడా లిప్ లాక్స్ చేస్తోంది. అందాలు ఆరబోస్తోంది. శంఖంలో పోస్తేనే తీర్థం అయినట్లు.. పెద్ద సినిమాల్లో లిప్ లాక్స్ చేసినా, ఎంత గ్లామర్ ఒలకబోసినా చెల్లిపోతుంది కానీ.. చిన్న సినిమాల్లో చేస్తే మాత్రం వల్గారిటీ అయిపోతుందన్నమాట.