Begin typing your search above and press return to search.

పవన్-మహేష్ మూవీల్లో చిన్న రోల్ చాలు

By:  Tupaki Desk   |   29 Dec 2015 10:30 PM GMT
పవన్-మహేష్ మూవీల్లో చిన్న రోల్ చాలు
X
పధ్నాలుగేళ్ల ప్రాయంలోనే కెరీర్ స్టార్ట్ చేసేయడంతో.. పాతికేళ్లు రాకుండానే పదేళ్ల ఎక్స్ పీరియన్స్ సంపాదించేసింది రెజీనా కసాండ్రా. ఈ చెన్నై చిన్నది యాంకర్ గా మొదలుపెట్టి, హీరోయిన్ గా మంచి క్రేజ్ నే సంపాదించుకుంది. అయితే.. రవితేజ తప్ప టాలీవుడ్ లో ఇప్పటివరకూ ఛాన్స్ ఇచ్చిన పెద్ద హీరో ఎవరూ లేరు.

ఈ ఏడాది సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రంతో హిట్ కొట్టినా.. 2015 చివర్లో సౌఖ్యం నిరాశపరిచింది. పెర్ఫామెన్స్ కేరక్టర్లు వెతుక్కుంటూ వస్తున్నా.. స్టార్ డమ్ కోసం గ్లామర్ టర్నింగ్ ఇచ్చుకుంది రెజీనా. అయినా పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నా.. సంక్రాంతి వస్తున్న విశాల్ కథకళి మీదే బోలెడు హోప్స్ పెట్టుకుంది. ఇందులో సెకండ్ హీరోయిన్ రోల్ అయినా.. చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని చెబ్తోంది. మరి కొత్త ఏడాది వస్తోంది కదా.. కొత్తగా పెళ్లి నిర్ణయాలేమైనా ఉన్నాయా అని అడిగితే.. రెజీనా నుంచి భలే ఆన్సర్ వచ్చింది.

కెరీర్ మొదలెట్టి పదేళ్లయింది కదా.. అందుకే పెళ్లి అంటున్నారా.. దానికింకా ఐదేళ్ల టైం ఉంది. అయినా.. నన్ను నన్నుగా అర్ధం చేసుకునే వాడు చాలు. అంతకు మించి కాబోయేవాడి మీద పెద్దగా ఆశలేం లేవని చెప్పేసింది రెజీనా. ఇంత క్లారిటీతో ఉందంటే.. ఎవరినో వెతుక్కునే ఉంటుందని అనుకుంటున్నారు చాలామంది. అయితే.. న్యూ ఇయర్ వేడుకలను ఇంకా ఫిక్స్ చేసుకోలేదట. షూటింగ్ లేకుండా ఉంటే బాగుండు.. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయచ్చంటోంది రెజీనా కసాండ్రా. ప్రస్తుతం మనోజ్ తో శౌర్య లోను, రాణాతో ఒక మూవీ, సందీప్ కిషన్ తో మరొక సినిమా చేస్తోందీ చెన్నై సుందరి. రవితేజ తప్ప అన్నీ చిన్న హీరోలతోనే చేసినా.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల సినిమాల్లో చిన్న కేరక్టర్ అయినా చేసేస్తుందట.