Begin typing your search above and press return to search.

90 ఏళ్లచ్చినా రెజీనా మర్చిపోదటగా!

By:  Tupaki Desk   |   6 Sep 2016 3:30 PM GMT
90 ఏళ్లచ్చినా రెజీనా మర్చిపోదటగా!
X
టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో రెజీనా కసాండ్రాను సంథింగ్ కాదు.. ఎవ్రీథింగ్ స్పెషల్ అనాల్సిందే. అమ్మడి దగ్గర అందం ఉంది.. అందాన్ని అందంగా చూపించే తెగువ ఉంది.. పాత్రకు తగ్గట్లుగా ఒదిగిపోగల ట్యాలెంట్ ఉంది. ఇన్ని ఉన్నా ఇంకా స్టార్ హీరోల సరసన చేసే ఆఫర్ రాలేదు కానీ.. అప్పుడే బాలీవుడ్ లో అడుగుపెట్టే అవకాశం మాత్రం వచ్చేసింది.

ఎప్పటికైనా బాలీవుడ్ లో ఓ సినిమా చేయాలని అనుకుందట రెజీనా. కానీ ఇంత త్వరగా ఆ అవకాశం వస్తుందని అనుకోలేదన్న రెజీనా.. తన బేస్ ని మాత్రం సౌత్ నుంచి కదల్చబోదట. ఇప్పుడు చేసిన జ్యో అచ్యుతానంద సినిమాలో లాంటి పాత్ర అయితే.. తనకు లైఫ్ వస్తుందని కూడా అనుకోవడం లేదట రెజీనా. అంత స్పెషల్ ఏంటంటే.. ఈ పాత్ర నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది.. భయపెడుతుంది అంటోంది. తనకు 90 ఏళ్లు వచ్చినా జ్యో అచ్యుతానందలో చేసిన రోల్ ని మర్చిపోలేదట. తన పిల్లలకు మనవలకు కూడా చూపించేస్తుందట రెజీనా.

ఇక ఇప్పటికే తమిళంలో తన గొంతు వినిపించిన భామ.. త్వరలో తెలుగులో కూడా వినిపించేందుకు ప్రయత్నిస్తానంటోంది. మరోవైపు.. తనకు సాయిధరంతేజ్ తో సహా ఎవరితోనూ రూమర్లు లేవని..ఇష్టం వచ్చినట్లు రాసేస్తున్నారని అంటోంది రెజీనా కసాండ్రా.