Begin typing your search above and press return to search.

రెజీనా ఒక్కత్తే ఆప్షన్ అయిపోయిందా!!

By:  Tupaki Desk   |   4 Aug 2016 3:30 PM GMT
రెజీనా ఒక్కత్తే ఆప్షన్ అయిపోయిందా!!
X
మనకి ఎలాంటి హీరోయిన్ కావాలి అని ఎవరైనా చిన్న బడ్జెట్ ఫిలిం మేకర్.. లేదంటే చిన్న హీరోలతో చేసే దర్శకులను అడిగితే.. 'స్టార్డమ్ ఉండాలి.. కాని రెమ్యూనరేషన్ తక్కువగా ఉండాలి. యాక్టింగ్ లోఇరగదీయాలి.. అలాగే అందంగా కూడా ఉండాలి. వీలైతే కాస్త గ్లామర్.. కుదిరితే కొంచెం హాటుగా సీన్లు' ఇలా ఉంటాయి డిమాండ్లు. మరి అన్నీ సూటయ్యే హీరోయిన్లు ఎవరున్నారు?

ఒకవైపు స్టార్డమ్ ఉండీ అటు చీప్ రెమ్యూనరేషన్లో దొరికే ఏకైనా హీరోయిన్ అంటే మాత్రం.. ఖచ్చితంగా రెజీనా ఒక్కత్తే. చాలా పెద్దపెద్ద హీరోయిన్లను ప్రయత్నించి.. చివరకు బడ్జెట్ లో చేసుకుందాం అనుకునేవారికి ఆమే ఆశాదీపం. నక్షత్రం సినిమాలో రెజీనానే తీసుకున్నాడు సందీప్ కిషన్‌. నారా రోహిత్ మరియు నాగ శౌర్య చేస్తున్న జో అచ్చుతానంద సినిమా కోసం రెజీనా వెంటనే ఓకె చెప్పింది. ఆ సినిమాను డైరక్ట్ చేస్తున్న కమెడియన్ శ్రీనివాస్ అవసరాల ఇప్పుడు తనకు ఒక హీరోయిన్ కావాలి అంటే.. సెక్స్ కామెడీ హంటర్ రీమేక్ కోసం ఈ బంగారమే ఓకె చెప్పేసింది. అలాగే మంచు మనోజ్ ఒక్కడే మిగిలాడు సినిమాలో నుండి ప్రగ్యా జైస్వాల్ పక్కకు తప్పుకుంటే ఆ పాత్రను చేయడానికి ముందుకొచ్చింది కూడా ఈ చెన్నయ్ బ్యూటీయే. ఎక్కడ అవసరమైనా కూడా రెజీనా ఒక్కత్తే బెస్ట్ ఆప్షన్ అయిపోయింది.

ఇదంతా ఒకెత్తయితే.. రెజీనాకు ఎందుకో పెద్ద హీరోల సినిమాలు మాత్రం రావట్లేదు. మహేష్‌ - చరణ్‌ - బన్నీ - ప్రభాస్‌.. తదితర ఎ-లిస్ట్ నటులు ఆమెకు ఛాన్సులివ్వాలంటే.. ఆమె ఖాతాలో ఒక భారీ బ్లాక్ బస్టర్ పడాల్సిందే.