Begin typing your search above and press return to search.

ఈ సిన్నది.. సౌత్ ని వదల్లేనంటోంది

By:  Tupaki Desk   |   23 Aug 2016 7:30 AM GMT
ఈ సిన్నది.. సౌత్ ని వదల్లేనంటోంది
X
ఇండియాలో ఏ భాషలో నటించే హీరోయిన్ టార్గెట్ అయినా.. సాధారణంగా ఒకటే ఉంటుంది. అదే బాలీవుడ్ హీరోయిన్ గా మారిపోవడం. అయితే.. తాము చేస్తున్న భాషల్లో క్రేజ్ ఉన్న వారికే బాలీవుడ్ నుంచి పిలుపు వస్తూ ఉంటుంది. తీరా అక్కడి నుంచి ఓ కాల్ రాగానే.. ఇక్కడ నుంచి తట్టాబుట్టా సర్దేసుకుని వెళ్లిపోతుంటారు చాలామంది. తీరా అక్కడ ఛాన్సులు రాక.. తిరిగి వెనక్కి రాలేక.. వచ్చినా ఆఫర్లు ఇచ్చేవారు లేక చాలానే ఇబ్బందులు పడుతూ ఉంటారు. లేటెస్ట్ గా అయితే.. ఇల్లీ బేబీని ఇందుకు బెస్ట్ ఎంగ్జాంపుల్ అనచ్చు.

రీసెంట్ గా సౌత్ లో తెగ సినిమాలు చేసేస్తున్న రెజీనా కసాండ్రాకు బాలీవుడ్ పిలుపు వచ్చింది. అది కూడా అమితాబ్ బచ్చన్ తో చేస్తున్న సినిమా కావడంతో.. అమ్మడిపై మీడియా ఫోకస్ ఎక్కువైపోయింది. అమితాబ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఆంఖే2' లో రెజీనా హీరోయిన్. ఈ మూవీలో యాక్ట్ చేసేందుకు ఎంపికవడం తన అదృష్టం అంటున్న ఈ భామ.. బాలీవుడ్ ఆఫర్ వచ్చినా తెలుగు.. తమిళ సినిమాలను మాత్రం నిర్లక్ష్యం చేయబోనని చెబుతోంది రెజీనా.

'నాకు సౌత్ తో ఉన్న అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. నా గురించి పాజివిట్స్.. నెగిటివ్స్ తెలిశాయంటే అందుకు కారణం.. దక్షిణాది పరిశ్రమలే. బాలీవుడ్ లోకి అడుగు పెట్టేముందు మరింతగా నైపుణ్యం సాధించడానికి టాలీవుడ్ - కోలీవుడ్ కారణాలు. సౌత్ కి నార్త్ కి సమానంగా ఇంపార్టెన్స్ ఇస్తాను తప్ప.. సౌత్ కి ఎప్పటికి దూరం కాను' అంటోంది రెజీనా కసాండ్రా. అయితే.. ఓ నాలుగు ఆఫర్లు వస్తే. ఆ తర్వాత కూడా ఇదే మాట చెప్పు రెజనా అంటున్నారు చాలామంది.